ETV Bharat / bharat

పెళ్లైన పదేళ్లకు చిన్నారి జన్మ.. 9నెలలకే మృతి.. గొంతులో మెంతోప్లస్ డబ్బా అడ్డుపడి.. - యూపీ గ్యాంగ్​స్టర్ జీవా మృతి

9 నెలల చిన్నారి మెంతోప్లస్ బామ్ డబ్బా మింగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన తర్వాత పదేళ్లకు జన్మించిన చిన్నారి మరణాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు. మరోవైపు, కుమారుడి పుట్టిన రోజు వేడుకగా నిర్వహించి... బయటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సైతం చనిపోయారు.

girl-born-after-10-years-of-marriage
girl-born-after-10-years-of-marriage
author img

By

Published : Jun 10, 2023, 12:46 PM IST

పెళ్లైన పదేళ్ల తర్వాత జన్మించిన చిన్నారి.. మెంతోప్లస్ బామ్ డబ్బాను మింగి 9 నెలల వయసులో ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులకు శోకం మిగిలింది. కర్ణాటక బళ్లారిలోని ఇందిరానగర్​లో ఈ ఘటన జరిగింది. 9 నెలల వయసు ఉన్న ప్రియదర్శిణి అనే చిన్నారి.. రెండు రూపాయల విలువైన మెంతోప్లస్ డబ్బాను మింగేసింది.

ముత్యాల రాఘవేంద్ర, తులసి దంపతులకు ప్రియదర్శిణి ఏకైక సంతానం. వివాహం జరిగి పదేళ్లు అయిన తర్వాత చిన్నారి జన్మించింది. అప్పటి నుంచి ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే, ఇంట్లో ఆడుకుంటుండగా.. చిన్నారి అనుకోకుండా మెంతోప్లస్ డబ్బాను మింగేసింది. గొంతులో అడ్డుపడిన డబ్బా.. చిన్నారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఏడుపును విన్న తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే, దారిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గొంతులో అడ్డుపడిన డబ్బాను తొలగించామని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కల్పన తెలిపారు. అపురూపంగా చూసుకుంటున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మరణ వార్త తెలిసి బంధువులు బోరున విలపిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం చిన్నారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

child died swallowing Menthoplus
ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

బర్త్​డే వేడుకలు.. కాసేపటికే ముగ్గురి మృతి
కుమారుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన కొద్ది సేపటికే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన లఖన్ (37).. తన సోదరి, బావ, మేనకోడలిని వారి ఇంట్లో దింపేందుకు బైక్​పై వెళ్లాడు. భరత్ విహార్ ప్రాంతం నుంచి సెక్టార్ 17 వైపు వెళ్తుండగా.. సెక్టార్ 13 నుంచి వస్తున్న ఓ ఎస్​యూవీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లఖన్​తో పాటు అతడి సోదరి ఫూలా(30), మేనకోడలు దీక్ష(10) ప్రాణాలు కోల్పోయారు.

లఖన్ బావ మాతే(32) ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డాడు. ఎస్​యూవీ వేగంగా తమపైకి దూసుకొచ్చిందని క్షతగాత్రుడు మాతె తెలిపారు. 'రిక్షాలో వెళ్తామని లఖన్​తో చెప్పాం. కానీ అతడే వినలేదు. లేట్ అయింది కాబట్టి బైక్​పై దించేస్తానని అన్నాడు. ఎన్ఎల్​యూ రెడ్​లైట్ ప్రాంతానికి చేరుకునే సరికి ఓ కారు మావైపు వేగంగా దూసుకొచ్చింది. యాక్సిడెంట్ తర్వాత నేను స్పృహ కోల్పోయా. ఆ తర్వాత ఆస్పత్రిలో నాకు మెళకువ వచ్చింది. నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఎడమ బొటనవేలికి గాయాలయ్యాయి' అని మాతె వివరించాడు.

మాతె కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడని.. ప్రమాదంలో కాలు విరగడం వల్ల ఇకపై అతడు పని చేయడం సాధ్యం కాదని అతడి బంధువు ములాం రాజక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మాతెకు తల్లిదండ్రులు, పన్నెండేళ్ల కుమారుడు ఉన్నారు. బర్త్​డే వేడుకకు కుమారుడు రాలేదని రాజక్ చెప్పాడు.

మరణించిన లఖన్ సైతం.. తన కుటుంబంలో పని చేస్తున్న ఏకైక వ్యక్తి. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితులంతా మధ్యప్రదేశ్​లోని తికామ్​గఢ్​ జిల్లాకు చెందినవారు. ఈ ప్రమాద ఘటనపై ద్వారకా నార్త్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్​యూవీ డ్రైవర్​ను అబ్రార్ (24)గా గుర్తించారు. అతడు నజాఫ్​గఢ్​లోని గోపాల్ నగర్​కు చెందిన వ్యక్తి అని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.

భర్తను హత్య చేసిన భార్యకు జీవితఖైదు
రెండేళ్ల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళకు ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలోని ఓ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆమె ప్రియుడికి సైతం యావజ్జీవ శిక్ష విధించింది. ఇద్దరూ రూ.20 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మృతుడి కుమార్తె అయిన ఆరేళ్ల బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తీర్పు చెప్పింది.

2022 జూన్ 2న తన భర్త సంజయ్ గుప్తాను హత్య చేసింది జ్యోతి. తన ప్రియుడు అబ్బాస్​తో ఉండేందుకు సంజయ్ అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం.. మృతుడి భార్య జ్యోతిని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిజం బయటపడింది. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న మృతుడి కుమార్తె ఈ కేసులో సాక్ష్యం చెప్పింది. నిందితుడు అబ్బాస్​ను గుర్తు పట్టిన బాలిక.. అతడే తన తండ్రిని చంపాడని సాక్ష్యం చెప్పింది. తల్లి కూడా అతడితో ఉందని తెలిపింది. దీంతో నిందితులిద్దరినీ దోషులుగా తేల్చి శిక్ష విధించింది కోర్టు.

బాలిక శరీరం నుంచి బుల్లెట్ తొలగింపు
ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో గ్యాంగ్​స్టర్ జీవా హత్య జరిగిన ఘటనలో గాయపడ్డ ఏడాదిన్నర బాలిక శరీరం నుంచి బుల్లెట్​ను తొలగించారు. చిన్నారి లక్ష్మి ఊపిరితిత్తులు, పక్కటెముకల మధ్యలో బుల్లెట్ ఇరుక్కుపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. వైద్యులు ఆమె పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు.

girl bullet up lucknow
గాయపడ్డ చిన్నారి చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.