Bus Accident In Jharkhand : ఝార్ఖండ్.. గిరిడీహ్ జిల్లాలోని బరాకర్ నదిలో శనివారం రాత్రి ఓ బస్సు అదుపుతప్పి పడిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని వెల్లడించారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని వారు వివరించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు అందించారు. స్థానికులు సైతం సహాయక చర్లల్లో పాల్గొని ఆసరాగా నిలిచారని అధికారులు తెలిపారు. మృతి చెందిన నలుగురిలో ముగ్గురిని గుర్తించామన్న అధికారులు.. శవ పరీక్షల కోసం మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను సంతోశ్ అగర్వాల్, మానిక్ చంద్ గుప్తా, ధనియాగా గుర్తించినట్లు వెల్లడించారు. కాగా బస్సు డ్రైవర్ ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలిపారు.
-
#WATCH | Jharkhand | A bus carrying passengers fell into a river in Giridih. Rescue operation is underway. pic.twitter.com/47WIsjzzDM
— ANI (@ANI) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jharkhand | A bus carrying passengers fell into a river in Giridih. Rescue operation is underway. pic.twitter.com/47WIsjzzDM
— ANI (@ANI) August 5, 2023#WATCH | Jharkhand | A bus carrying passengers fell into a river in Giridih. Rescue operation is underway. pic.twitter.com/47WIsjzzDM
— ANI (@ANI) August 5, 2023
ప్రమాదం జరిగింది ఇలా..
Giridih Bus Accident : రాంచీ నుంచి గిరిడీహ్ వెళ్తున్న ఓ బస్సు బరాకర్ నదిలో పడిపోయింది. రాంచీలో బయలుదేరిన బస్సు.. బరాకర్ నది వద్దకు చేరుకోగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికుల కేకలు విన్న స్థానికులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డీసీ నమన్ ప్రియేష్ లక్డా, ఎస్పీ దీపక్ శర్మ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
డీసీ నమన్ ప్రియేష్ లక్డా, ఎస్పీ దీపక్ శర్మ రాత్రంతా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర మంత్రి బేబి దేవి శనివారం అర్థరాత్రి ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటంబాలకు సంతాపం ప్రకటించిన ఆమె.. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గేషియా అందిస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదివ్య కుమార్ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి సైతం ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదంపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యకం చేశారు.
పోలీస్‌స్టేషన్‌కు నిరసనకారుల నిప్పు.. సీజ్ చేసిన 'గంజాయి' అమ్ముతున్నారని ఆరోపిస్తూ..