Ghulam Nabi Azad Padma Bhushan controversy: కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించడం చర్చనీయాశమైంది. దీనిపై ఆయన సొంతపార్టీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.. కేంద్రం ప్రకటనపై వ్యంగ్యంగా స్పందించారు. బంగాల్ మాజీ సీఎం, వామపక్ష నేత బుద్ధదేవ్ భట్టాచార్య తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. గులాం నబీ ఆజాద్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
Ghulam Nabi Azad Congress:
అవార్డును తిరస్కరించి బుద్ధదేవ్ సరైన పనే చేశారని జైరాం రమేశ్ అన్నారు. 'బుద్ధదేవ్ ఆజాదీ(స్వతంత్రం)గా ఉండాలనుకుంటున్నారు. గులాం(బానిస)గా కాదు' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
Ghulam Nabi Azad Kapil Sibal:
మరోవైపు, కాంగ్రెస్ నాయకత్వాన్ని సంస్కరించాలంటూ లేఖ రాసిన నేతల్లో(జీ-23 బృందం) ఒకరైన కపిల్ సిబల్.. ఆజాద్‌కు పద్మ పురస్కారం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో పార్టీ అధిష్ఠానానికి చురకలు అంటించారు. ప్రజలకు ఆజాద్ చేసిన సేవను దేశమంతా గుర్తిస్తోందని, తన సొంత పార్టీ మాత్రం ఆయన సేవలను కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇది విచిత్రమని ట్వీట్ చేశారు.
ట్విట్టర్ బయోలో 'కాంగ్రెస్' లేదు!
అదేసమయంలో, ఆజాద్ ట్విట్టర్ బయోను మార్చినట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆజాద్ స్వయంగా వివరణ ఇచ్చారు. తాను ట్విట్టర్ ప్రొఫైల్‌ను మార్చలేదని స్పష్టం చేశారు. ఇది గందరగోళం సృష్టించేందుకు కావాలని చేసిన దుష్ప్రచారమని అన్నారు.
Congress crisis Ghulam nabi
పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన 23 మందిలో ఆజాద్ సైతం ఉన్నారు. ఈ వ్యవహారం తర్వాత గాంధీ కుటుంబ విధేయుల నుంచి ఆజాద్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ఆజాద్‌ను మెచ్చుకుంటూ కన్నీటిపర్యంతం అవడం, ఆ తర్వాత మోదీపైనా ఆజాద్ ప్రశంసలు కురిపించడం వంటి ఘటనలు.. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయ భవితవ్యంపై మాట్లాడుతూ తానిప్పుడు స్వేచ్ఛా జీవినని.. ఎక్కడికైనా వెళ్తానని చెప్పడమూ కాంగ్రెస్‌లో కలకలం రేపింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే డ్యూటీ.. సీఎం వరాల జల్లు