కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల దిల్లీలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం తప్పింది. దిల్లీలోని జీబీ రోడ్ కోటా నంబర్- 58లో సెక్స్ వర్కర్లు నివసించే ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బీట్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికుల సాయంతో భవనంలో ఉన్న 70 మంది సెక్స్‌వర్కర్లు వారి పిల్లలను కష్టం మీద కాపాడారు.
కానిస్టేబుల్ సమయానికి రాకుంటే చాలామంది మంటల్లో కాలిపోయేవారని స్థానికులు వెల్లడించారు. అనంతరం కానిస్టేబుల్‌ను అభినందిచారు.