ETV Bharat / bharat

పాకిస్థాన్​కు సైనిక సమాచారం లీక్​!.. గ్యాస్​ ఏజెన్సీ ఓనర్​ అరెస్ట్​​

పాకిస్థాన్​కు సైనిక సమాచారం చేరవేసిన ఓ గ్యాస్​ ఏజెన్సీ ఓనర్​ను (pakistan spy arrested in india) పోలీసులు అరెస్ట్​ చేశారు. నర్హార్​ ఆర్మీ బేస్​కు చెందిన కొంత రహస్య సమాచారం సహా పలు ఫొటోలను కూడా పాక్​ గూఢచారులకు సందీప్​ పంపాడని అధికారులు చెప్పారు.

pakistan handlers in india
పాకిస్థాన్​కు సైనిక సమాచారం లీక్​!.. గ్యాస్​ ఎజెన్సీ ఓనర్​ అరెస్ట్​​
author img

By

Published : Sep 17, 2021, 12:21 PM IST

రాజస్థాన్​లోని ఝున్​ఝును జిల్లాకు చెందిన ఓ ఎల్​పీజీ సిలిండర్​ పంపిణీ కేంద్రం యజమానిని (pakistan spy arrested in india) పోలీసులు అరెస్టు చేశారు. సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్​కు చేరవేస్తుండమే ఇందుకు కారణం. నిందితుడిని నర్​హర్​ గ్రామానికి చెందిన సందీప్​ కుమార్​గా (30) పోలీసులు గుర్తించారు.

అధికారుల వివరాల ప్రకారం..

పాకిస్థాన్​ గూఢచారులు.. భారత సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు సందీప్​ కుమార్​ను (pakistan spy agency) సంప్రదించారు. డబ్బు ఆశచూపి.. సైన్యానికి చెందిన వివరాలు కావాలని కోరారు. ఈ క్రమంలో.. సైనిక స్థావరాల సమీపంలో సిలిండర్లు డెలివరీ చేస్తూ కొంత సమాచారం తెలుసుకున్నాడు సందీప్​. నర్హార్​ ఆర్మీ బేస్​కు చెందిన కొంత రహస్య సమాచారం సహా పలు ఫొటోలను కూడా పాక్​ గూఢచారులకు పంపాడు.

ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు దర్యాప్తు నిమిత్తం ఈనెల 12న నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. జులైలోనే పాకిస్థాన్​ గూఢచారులు తనను సంప్రదించినట్లు సందీప్​ వెల్లడించాడని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి.. కేసు నమోదు చేసిన అధికారులు, అతడిని గురువారం అరెస్టు చేశారు. ​

ఇదీ చూడండి : ఆపరేషన్​ పోలోకు ముందే తెరవెనక యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.