ETV Bharat / bharat

12-16 వారాల తర్వాతే కొవిషీల్డ్​ రెండో డోసు - కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

కొవిషీల్డ్​ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో టీకా కొవాగ్జిన్​ డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొవిషీల్డ్​ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచటం ఇది రెండోసారి.

Covishield vaccine
కొవిషీల్డ్‌ టీకా
author img

By

Published : May 13, 2021, 6:29 PM IST

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న మరో టీకా కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

" నిజ జీవిత ఆధారాలు, ముఖ్యంగా యూకే నుంచి లభించిన ఆధారాలతో కొవిషీల్డ్​ డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచేందుకు కొవిడ్​-19పై ఏర్పాటైన వర్కింగ్​ బృందం సిఫార్సు చేసింది. కొవాగ్జిన్​ డోసుల మధ్య వ్యవధిపై ఎలాంటి సిఫార్సులు చేయలేదు. వర్కింగ్​ కమిటీ సిఫార్సులను మే 12న జరిగిన భేటీలో డాక్టర్​ వీకే పాల్​ నేతృత్వంలోని వ్యాక్సిన్​ నిర్వహణ జాతీయ నిపుణుల బృందం (ఎన్​ఈజీవీఏసీ) ఆమోదించింది."

- కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ నిపుణుల బృందం గురువారం సిఫార్సులు చేసింది. అంతకుముందు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది లాన్సెట్‌ కూడా కొవిషీల్డ్‌పై ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. రెండో డోసును 12, అంతకంటే ఎక్కువ వారాలకు పెంచడం వల్ల ఈ టీకా 81.3శాతం సమర్థంగా పనిచేస్తుందని ఆ కథనంలో పేర్కొంది. అదే ఆరు వారాల వ్యవధిలో ఇస్తే టీకా సమర్థత కేవలం 55.1శాతంగానే ఉందని అధ్యయనకారులు గుర్తించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టీకా డోసుల అంతరంలో మార్పులు చేసింది.

కాగా.. కొవిషీల్డ్‌ డోసుల మధ్య గడువు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ టీకాతో మెరుగైన ఫలితాలు పొందేందుకు వ్యవధిని 28 రోజుల నుంచి 6-8 వారాలకు పెంచుతూ ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇప్పుడు 12-16 వారాలకు పెంచింది. అయితే వ్యాక్సిన్ల కోసం డిమాండ్‌ పెరుగుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: వచ్చే వారం మార్కెట్లోకి స్పుత్నిక్​-వి టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.