Ganja smuggling: ఒడిశా మల్కాన్‌గిరిలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) అరెస్టు అయ్యాడు. నిందితుడిని జయదశ్ ఖారాగా గుర్తించారు.
Odisha ASI ganja smuggling
ఈ కేసుకు సంబంధించి ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు యువకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 420 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ ల్యాప్‌టాప్, రూ.10 వేల నగదు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్మగ్లింగ్‌లో ఏఎస్ఐ పాత్ర ఉందన్న అనుమానాలతో.. మల్కాన్‌గిరి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్మగ్లర్లతో కుమ్మక్కై.. గంజాయిని జిల్లాను దాటిస్తున్నాడని గ్రహించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పక్కా ప్రణాళికలు వేశారు. ఛత్తీస్‌గఢ్‌కు గంజాయి రవాణా చేస్తుండగా.. అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: తిండి లేకుండా.. 'సోలార్ ఎనర్జీ'తో పాతికేళ్లు బతికిన వ్యక్తి మృతి