ETV Bharat / bharat

ఫిలిప్పీన్స్​లో గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పుజారి అరెస్ట్​ - ఫిలిప్పీన్స్​లో గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పుజారి అరెస్ట్​

ముంబయి, ఠాణెల్లో జరిగిన పలు నేరాల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పుజారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఫిలిప్పీన్స్​లోని పరానాక్ నగరంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Gangster Suresh Pujari arrested
సురేశ్​ పుజారి అరెస్ట్​
author img

By

Published : Oct 20, 2021, 9:57 AM IST

ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన నేరాల్లో కీలక నిందితుడుగా ఉన్న పేరుమోసిన గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పుజారి ఎట్టకేలకు అరెస్ట్​ అయ్యాడు. మంగళవారం అతడిని ఫిలిప్పీన్స్​లో అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వర్గాలు తెలిపారు. ఠాణెలో ఎక్కువ కేసులు నమోదైనట్లు ఓ సీనియర్​ అధికారి చెప్పారు. నిందితుణ్ని కస్టడీకి కోరినట్లు పేర్కొన్నారు.

ఈ అరెస్ట్​పై ముంబయి పోలీసులు అధికారికంగా స్పందించలేదు. ఫిలిప్పీన్స్​​లోని ఓ వార్తా సంస్థ సురేశ్​ బాసప్ప పుజారి అనే వ్యక్తిని పరానాక్​ సిటీలో అరెస్ట్​ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా నిందితుడు దేశంలో ఉంటున్నట్లు రాసుకొచ్చింది.

పుజారిపై ఇప్పటివరకు ఠాణెలో 23 కేసులు నమోదైనట్లు సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. నిందితునిపై ఇంటర్​పోల్​కు లుక్​ ఆవుట్​ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2020 లో అరెస్ట్​ అయిన అండర్​ వరల్డ్​ డాన్ రవి పుజారికి సురేశ్​ బంధువు.

ఇదీ చూడండి: మోదీ.. 'జేమ్స్​ బాండ్ 007'- టీఎంసీ సెటైర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.