ETV Bharat / bharat

కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్​ రేప్ - కర్ణాటక గ్యాంగ్​రేప్

బాయ్​ఫ్రెండ్​తో కలిసి కొండ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కాలేజీ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు పలువురు దుండగులు. యువకుడిని చితకబాదారు. ప్రస్తుతం బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Gangrape on a college student in mysore
కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై అత్యాచారం
author img

By

Published : Aug 25, 2021, 4:41 PM IST

Updated : Aug 25, 2021, 7:34 PM IST

కర్ణాటకలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్​లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన విద్యార్థినిపై గ్యాంగ్​రేప్(mysore gangrape) జరిగింది. యువతి తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి చాముండి హిల్స్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో పలువురు దుండగులు ఈ అమానుషానికి పాల్పడ్డారు.

Gangrape on a college student in mysore
అత్యాచారం జరిగిన ప్రాంతంలో పోలీసు వాహనం

ఏం జరిగిందంటే?

యువతి, తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి మైసూరులోని చాముండి హిల్స్​కు వెళ్లింది. అక్కడి నుంచి బైక్​పై తిరిగి వస్తుండగా.. కొందరు యువకులు వారిని అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వద్ద పెద్దగా నగదు లేకపోవడం వల్ల.. దుండగులు దాడి చేశారు. యువతి బాయ్​ఫ్రెండ్​ను చితకబాదారు. లలితాద్రిపుర రహదారి వద్ద యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారాని సమాచారం. ప్రస్తుతం యువతి, యువకుడు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై విచారణ చేపట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మైసూరు కమిషనర్ చంద్రగుప్త.. ఘటనాస్థలిని పరిశీలించారు. యువకులు బయటి నుంచి వచ్చారా? లలితాద్రిపుర హిల్స్​లో వారు ఏం చేస్తున్నారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలనహళ్లి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

Gangrape on a college student in mysore
అత్యాచారం జరిగిన ప్రాంతం

సీఎం స్పందన..

ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. దిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. నిందితులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని అదేశించినట్లు తెలిపారు.

మరోవైపు ఈ ఘటన దురదృష్టకరమని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసిందని చెప్పారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇతర వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మిత్రుడి ప్రాణాలు కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా..

Last Updated : Aug 25, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.