ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​లో సామూహిక అత్యాచారం.. అక్కడి ఉద్యోగుల పనే.. - Delhi Police

Woman Raped Delhi Railway Station: దిల్లీలో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళపై రైల్వే స్టేషన్​లోనే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు రైల్వే శాఖ ఉద్యోగులు. జులై 21న ఈ ఘటన జరిగింది.

GANGRAPE AT NEW DELHI RAILWAY STATION
GANGRAPE AT NEW DELHI RAILWAY STATION
author img

By

Published : Jul 23, 2022, 11:14 AM IST

Updated : Jul 23, 2022, 1:53 PM IST

Woman Raped Delhi Railway Station: న్యూ దిల్లీ రైల్వే స్టేషన్​లో ఓ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు కామాంధులు. 8-9 ప్లాట్​ఫాం వద్ద ఉన్న విద్యుత్​ నిర్వహణ సిబ్బంది కోసం నిర్మించిన చిన్న రూంలో ఇద్దరు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో నిందితులకు మరో ఇద్దరు సహకరించారు. వీరంతా ఎలక్ట్రికల్​ డిపార్ట్​మెంట్​లోనే పనిచేసే రైల్వే శాఖ ఉద్యోగులు. జులై 21 రాత్రి ఈ ఘటన జరిగినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఫరీదాబాద్​కు చెందిన బాధితురాలికి అత్యాచారం చేసిన వారిలో ఒకరితో పరిచయం ఉంది. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళకు.. నిందితుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపాడు. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలోనే జులై 21న తన కుమారుడి పుట్టినరోజుకు ఆమెను ఆహ్వానించిన నిందితుడు.. రైల్వే స్టేషన్​కు తీసుకెళ్లి మరికొందరితో కలిసి రేప్​కు పాల్పడ్డాడు. ఈ ఘోరం జరుగుతున్నప్పుడు మరో ఇద్దరు రైల్వే సిబ్బంది గది బయట కాపాలాగా ఉన్నారు. అఘాయిత్యం చేసిన తర్వాత బెదిరించి పంపించినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు వివరించింది. రైల్వే శాఖ కూడా దీనిపై దర్యాప్తు చేస్తోంది.

ఇవీ చూడండి: ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా? లేక..

గుట్టలుగా నోట్ల కట్టలు.. మంత్రి అరెస్ట్​.. రూ. 20 కోట్లు స్వాధీనం

Last Updated : Jul 23, 2022, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.