ETV Bharat / bharat

Gangajal in House How it Effects: మీ ఇంట్లో గంగాజలం ఉందా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకూడదు..! - గంగాజలం వల్ల లాభాలు

Gangajal in House How it Effects : మన దేశంలో గంగాజలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగాజలం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు. అందుకే.. చాలా మంది హిందువులు ఇళ్లల్లో గంగాజలం లేదా ఇతర పవిత్ర నదీ జలాలు ఉంచుతారు. మరి గంగాజలం ఇంట్లో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? చేయకూడని పనులేంటి..??

Gangajal in House How it Effects
Gangajal in House How it Effects
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 1:59 PM IST

Gangajal Dos and Don'ts in House: హిందువులు గంగా నదిని దేవతా స్వరూపంగా భావిస్తారు. అందుకే.. అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గంగాజలం ఉపయోగిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. గంగ మోక్షాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఎంతో మంది గంగా నదిలో స్నానం చేస్తారు. గంగా నదిలో మునిగితే.. వారి పాపాలన్నిటినీ దూరం చేస్తుందని విశ్వాసం. ఈ యుగంలో కూడా గంగా దేవి పట్ల ప్రజలకు ఎనలేని భక్తిభావం ఉంది.

గంగా పుష్కరాలకు వెళ్లినప్పుడు చాలా మంది ప్రజలు.. ఖచ్చితంగా గంగాజలాన్ని తీసుకొచ్చి తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఎందుకంటే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. గంగాజలాన్ని ఇంట్లో ఉంచితే.. జీవితంలో అభివృద్ధి ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఈ నీరు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నష్టపోతారని పండితులు చెబుతున్నారు. మరి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గంగాజలాన్ని వీటిలో ఉంచకూడదు..: సాధారణంగా.. ప్రజల ఇళ్లలో గంగాజలాన్ని ప్లాస్టిక్ సీసాలు లేదా డబ్బాలు, మొదలైనవాటిలో ఉంచటం తరచుగా కనిపిస్తుంది. అయితే.. గంగాజలాన్ని పొరపాటున కూడా ఈ విధంగా ఉంచకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్‌ను స్వచ్ఛమైనదిగా ఎవరూ పరిగణించరు. గంగాజలాన్ని ఎల్లప్పుడూ పవిత్రమైన పాత్రలో ఉంచాలి. వీలైనంతవరకు గంగాజలాన్ని ఉంచడానికి రాగి, ఇత్తడి, మట్టి లేదా వెండి పాత్రలో ఉంచడమే ఉత్తమం. వీలుకాకపోతే గాజు సీసాలో కూడా గంగాజలం నిల్వచేసుకోవచ్చు.

పొరపాటున కూడా ఈ పని చేయకండి..: మీ ఇంట్లో గంగాజలం ఉంచినట్లయితే ప్రతి సందర్భంలోనూ స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గంగాజలం ఉంచిన ప్రదేశంలో పొరపాటున కూడా నీచు వస్తువులు, మత్తు పదార్థాలు ఉంచకూడదు. వంట గదికి దూరంగా గంగాజలాన్ని ఉంచాలి. ఒకవేళ మీరు ఈ నియమాన్ని పాటించనట్లైతే.. సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, గ్రహ దోషం కూడా ఉంటుందని చెబుతున్నారు.

అటువంటి ప్రదేశంలో గంగాజలాన్ని ఉంచవద్దు..: గంగాజలాన్ని చీకటిగా ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ ఉంచకూడదు. గంగాజల్ జీవితంలో స్వచ్ఛతను అందిస్తుంది కాబట్టి చీకటి ఉన్న ప్రదేశంలో దానిని ఎప్పుడూ ఉంచకూడదు. గంగాజలం పవిత్రమైనది కాబట్టి దానిని ఎక్కడ పెడుతున్నామో చూసి అక్కడ మురికి ఉండకుండా చూడాలి.

మురికి చేతులతో ముట్టుకోకూడదు..: గంగాజలాన్ని ముట్టుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మురికి చేతులతో గంగాజలాన్ని తాకడం మంచిది కాదు. గంగాజలాన్ని తాకడానికి ముందు చేతులను బాగా కడుక్కోవాలి. గంగాజలాన్ని మురికి చేతులతో తాకితే అది పెద్ద దోషం. ఇది చెడును కలిగిస్తుందని, సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు.

అక్కడే గంగాజలాన్ని ఉంచాలి..: గంగాజలాన్ని ఎప్పుడూ బెడ్​రూమ్​లో, వంటగదిలో లేదా భోజనాల గదిలో ఉంచకూడదు. అలాగే బాత్రూమ్ దగ్గర కూడా ఉంచకూడదు. గంగాజలాన్ని ఎప్పుడూ పవిత్ర స్థలంలో అంటే పూజగదిలో ఉంచాలి. మరోవైపు నాన్‌వెజ్‌ చేసే ఇళ్లలో గంగాజలాన్ని కూడా ఉంచకూడదని.. ఇలా చేయడాన్ని పాపంగా భావిస్తారు.

బహిష్టు సమయంలో తాకవద్దు..: పీరియడ్స్​ సమయంలో స్త్రీలు లేదా బాలికలు గంగాజలాన్ని తాకకూడదు.

గ్రహణం సమయంలో..: సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో గంగాజలాన్ని తాకకూడదు. అదే విధంగా బిడ్డ పుట్టే సమయంలో సూతకం, మైల సమయంలో కూడా గంగా జలాన్ని తాకకూడదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.