ETV Bharat / bharat

ఆటోలో వెళ్తున్న యువతిపై గ్యాంగ్​రేప్​.. బోటు బోల్తా పడి నలుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. మరోవైపు, మధ్యప్రదేశ్​లోని చంబల్​ నదిలో బోటు మునిగి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

gang rape in lucknow
యువతిపై అత్యాచారం
author img

By

Published : Oct 17, 2022, 1:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూలో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. శనివారం జరిగిందీ ఘటన. నిందితులుపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ దృష్టికి చేరడం వల్ల తక్షణమే నిందితులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని విభూతిఖండ్​ పోలీసులను ఆదేశించారు. నిందితులను ఆకాశ్​, ఇమ్రాన్​లుగా గుర్తించారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కథౌటా ప్రాంతంలోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తి ఉన్నాడు. హుస్దియా కూడలి సమీపంలోకి రాగానే డ్రైవర్ వేరే రూట్​లో ఆటోను నడిపాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన బాధితురాలు కేకలు వేసింది. దీంతో ఆటో డ్రైవర్​ ఆమె తిట్టాడు. బాధితురాలు మళ్లీ అరిచేసరికి.. ఆమె తలపై దాడి చేశారు ఇద్దరు నిందితులు. అనంతరం బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.

నిందితులిద్దరూ బాధితురాల్ని ఆటోలో సుశాంత్ గోల్ఫ్ సిటీలోని ప్లాసియో మాల్ దగ్గర పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెపై 3 గంటల పాటు అత్యాచారం చేసి.. తీవ్రంగా గాయపరిచారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. అనంతరం ఇంటికి చేరుకుంది. 'బాధితురాలి.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఆమె ట్యూషన్​లు చెబుతూ తన పాఠశాల ఫీజులు కడుతోంది. విభూతిఖండ్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదుకు నిరాకరించారు' అని బాధితురాలి బంధువులు తెలిపారు.

బోటు బోల్తా..
మధ్యప్రదేశ్ మంద్​సౌర్​లోని చంబల్ నదిలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు మరణించారు. ఈ పడవలో మొత్తం ఏడుగురు ప్రయాణించగా.. అందులో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది నాలుగు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతులను ప్రేమ్ బాయి, రాధాబాయి, మధు బాయి, ధాపు బాయిగా గుర్తించారు.

ఇవీ చదవండి: కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్​, ఈ క్షణం కోసమే ఎదురుచూశానన్న సోనియా

రైల్వే ప్లాట్​ఫామ్​పై ఆటో నడిపిన డ్రైవర్​​, షాకిచ్చిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.