ETV Bharat / bharat

రోడ్డు పక్కన పట్టపగలే 'గ్యాంగ్​ రేప్'​.. బట్టలు లేకుండానే స్టేషన్​కు మహిళ! - Crime news

Gang rape: ఒంటరిగా వెళ్తున్న మహిళను పట్టపగలే దారిలో అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత బాధిత మహిళ చీర లేకుండానే జనం ఉండే చోటుకు వెళ్లింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అమానుష ఘటన రాజస్థాన్​, ఉదయ్​పుర్​ జిల్లాలో వెలుగు చూసింది.

gang-rape
దారి అడ్డగించి గ్యాంగ్​ రేప్​
author img

By

Published : Jan 21, 2022, 3:17 PM IST

Gang rape: పట్టపగలు దారిలో అడ్డగించి గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన రాజస్థాన్, ఉదయ్​పుర్​ జిల్లాలోని ఝాఢోల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాఘ్​పూరా చౌక్​ ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగటం గమనార్హం.

ఇదీ జరిగింది..

తమ గ్రామానికి దారి వెంట ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న వివాహితను.. ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే మహిళను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించటం ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు మహిళను రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బైక్​ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తేరుకున్న బాధిత మహిళ ఒంటిపై చీర లేకుండానే 500 మీటర్ల దూరంలో ఉన్న బాఘ్​పూరా చౌక్​కు వెళ్లింది. అక్కడ ఉన్న వాళ్లకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది.

సమాచారం అందిన వెంటనే ఉదయ్​పుర్​ ఎస్పీ మనోజ్​ చౌదరి, ఝాఢోల్​ పోలీస్​ స్టేషన్​ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మహిళ చీర, ఓ చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు పరిసర ప్రాంతవాసులేనని అనుమానిస్తున్నారు. వివాహితను వైద్య పరీక్షలకు పంపించి.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'గ్యాంగ్​ రేప్'​ ముఠా అరెస్ట్​.. హైవేపై వెళ్లే భార్యాభర్తలే వారి లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.