ETV Bharat / bharat

15 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్​రేప్​.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - ఉత్తర్​ప్రదశ్​లో వివాహితపై యాసిడ్​ దాడి

15 ఏళ్ల అమ్మాయిపై నలుగురు వ్యక్తులు రెండు రోజుల పాటు గ్యాంగ్​ రేప్​నకు తెగబడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో జరిగింది. దేశ రాజధాని దిల్లీలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. తన పిల్లలను కూడా గాయపరిచాడు.

Four Youths Gang Rape of a Minor Girl In Kalyan

author img

By

Published : Apr 28, 2023, 12:57 PM IST

15 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్​ రేప్​నకు పాల్పడ్డారు నలుగురు నిందితులు. రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మైనర్​ కూడా ఉన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్సే​వాడీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల అమ్మాయి నివసిస్తోంది. ఏప్రిల్​ 24న ఆమె స్నేహితుడు ఇన్​స్టాగ్రామ్​లో మెసేజ్​ చేసి.. తన ఇంటికి రమ్మని పిలిచాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లిన బాలికపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు మరొకరి ఇంటికి తీసుకెళ్లి రేప్​ చేశారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి ఇంకా రాలేదని కంగారు పడిన ఆమె కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కోసం ముమ్మరంగా గాలించారు. ఏప్రిల్​ 26న కల్యాణ్​ రైల్వే స్టేషన్​లో బాధితురాలు దొరికింది. అమ్మాయిని విచారించగా.. గ్యాంగ్​ రేప్​ ఘటన గురించి చెప్పింది. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలించారు. 12 గంటల్లో నిందితులు సాహిల్​ రాజ్​భర్​(18), సుజల్​ రమేశ్​(20), విజయ్​ రాజేశ్​ బెరా(21), మరో మైనర్​ను అరెస్టు చేశారు. అందులో మైనర్​ బాలుడిని జువెనైల్​ హోమ్​కు తరలించారు.

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..
దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అడ్డం వచ్చిన కుమార్తె(30), కుమారుడిని(28) కూడా గాయపరిచాడు. ఈ ఘటన నెబ్​ సరాయ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గురువారం సాయంత్రం 6.24 గంటలకు జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తి విజయ్​ వీర్​ గఢ్​ముక్తేశ్వర్.. కుటుంబంతో సహా నెబ్​ సరాయ్​ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న విజయ్​.. కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈ విషయంపై నిలదీసిన భార్యను, పిల్లలను తరచూ కొట్టేవాడు. అయితే, గతంలో కూడా భార్యాపిల్లలను చంపేందుకు కాల్పులు జరపగా.. కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత సెటిల్​మెంట్​ చేసి భార్యభర్తలిద్దరినీ ఇంటికి పంపించారు. అయినా మారని నిందితుడు.. తరచూ గొడవ పడుతుండేవాడు. భార్యను ఎలాగైనా చంపాలనుకున్న విజయ్​.. గురువారం తన భార్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేశాడు. అడ్డొచ్చిన పిల్లలపై విచక్షణారహింతంగా దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ.. నిందితుడి భార్య చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.

12 ఏళ్ల బాలుడు సజీవ దహనం..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఓ పొలంలో నిర్మించిన గుడిసెలో మంటలు చెలరేగి 12 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాలుడి మృతదేహం బయటకు తీశారు. ఈ ఘటన ఎటా జిల్లాలో గురువారం జరిగింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జస్​రథ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఖజురియానా గ్రామంలో ఓ 12 ఏళ్ల బాలుడు నివసిస్తున్నాడు. గురువారం సాయంత్రం తన స్నేహితుడితో కలసి.. ఊరు బయట పొలంలో ఉన్న గుడిసెలోకి ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడ బీడీ, అగ్గి పుల్లలు కనిపించాయి. వాటితో పిల్లలు ఆడుకున్నారు. ప్రమాద వశాత్తు.. మంటలు అంటుకోవడం వల్ల ఓ బాలుడు బయటకు వెళ్లిపోయాడు. మరో బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. మంటలు తీవ్రంగా చెలరేగడం వల్ల.. సజీవ దహనం అయ్యాడు. దాదాపు గంట తర్వాత సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వివాహితపై యాసిడ్​ దాడి..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ వివాహితపై యాసిడ్​ దాడికి పాల్పడ్డారు తన కుటుంబ సభ్యులు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్​ 22న ఓ యువతికి వివాహం అయింది. అత్తవారింట్లో ప్రేమికుడితో మాట్లాడుతుందన్న కారణంతో.. యువతి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె తండ్రి, సోదరుడు, ఇతర బంధువులతో కలసి బాధితురాలిపై యాసిడ్​తో దాడి చేశారు. అనంతం అడవిలో వదిలేశారు. అడవిలో రోడ్డుపై పడిఉన్న బాధితురాలి గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. యువతి తండ్రి తోటరామ్, సోదరుడు ప్రేమ్​పాల్​ మరో వ్యక్తి దినేశ్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.