ETV Bharat / bharat

'గగన్​యాన్​'పై​ కేంద్ర మంత్రి కీలక ప్రకటన - గగన్​యాన్​ మిషన్

2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో గగన్‌యాన్ యాత్ర జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కొవిడ్​-19 కారణంగా ఈ మానవ సహిత యాత్ర వాయిదా పడిందని స్పష్టం చేశారు.

Gaganyaan
గగన్​యాన్
author img

By

Published : Sep 16, 2021, 5:54 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో.. జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత యాత్ర కరోనా కారణంగా వాయిదా పడిందని చెప్పారు.

" మనం ఇదివరకే గగన్​యాన్​ యాత్రను ప్రారంభించాల్సింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు జరగాల్సింది. కానీ కొవిడ్-19 కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో ఈ యాత్ర ప్రారంభం అవ్వొచ్చు."

-- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి

భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) నిర్వహించిన ఓ వెబినార్‌లో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రతి రంగంలోనూ స్పేస్ టెక్నాలజీకి పాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అంతరిక్ష సాంకేతికతలో మరిన్ని అంకుర సంస్థలు రావాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. స్పేస్​ టెక్నాలజీలో ఓషియన్ దేశాల భాగస్వామ్యంతో ముందుకెళ్తామన్నరు.

విపత్తు నిర్వహణలో అంతరిక్ష సాంకేతికత చాలా ఉపయోగకరంగా ఉందని జితేంద్ర సింగ్ కొనియాడారు.

ఇదీ చదవండి: ఎస్​సీఓ ​సదస్సులో వర్చువల్​గా మోదీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.