ETV Bharat / bharat

Gaddar Life Story : గద్దర్‌...! ఆ పేరే ఓ విప్లవ స్వరం..! ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.? - గద్దర్​పై ప్రత్యేక కథనం

Gaddar Life Story : గద్దర్‌...! ఈ పేరే ఓ విప్లవ స్వరం..! ఒగ్గుకథలు, బుర్రకథల రూపంలో ఆయనలో మొగ్గ తొడిగిన సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాటగీతికగా రూపుదిద్దుకుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమబాట మళ్లించి ప్రజాయుద్ధనౌకగా చెరగని ముద్రవేశారు. చిన్ననాటి నుంచే ప్రజాజీవితాన్ని ప్రారంభించిన గద్దర్‌... తుదివరకూ పీడితవర్గ పక్షపాతిగానే జీవనం సాగించారు.

Gaddar
Gaddar Life Story
author img

By

Published : Aug 7, 2023, 8:59 AM IST

Gaddar Life Story : గద్దర్‌...! ఈ పేరే ఓ విప్లవ స్వరం..!

Telangana Folk Singer Gaddar Life Story : నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్‌ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు. ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దర్‌... క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం ఝళిపించారు. కుటుంబ నియంత్రణ, కుల వివక్ష, అస్పృశ్యత, దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో దాదాపు 600పైగా పాటలు పాడారు.

Poet Gaddar Passed Away : విద్యార్థి దశ నుంచే గద్దర్‌... ప్రజాజీవితంలో సాగారు. శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం, విప్లవకారులైన వెంపటాపు సత్యం తదితరుల ప్రభావం గద్దర్‌పై బలంగా ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. 1970వ దశకంలో విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తెలుగు సమాజంలో జరిగిన అన్ని ప్రత్యామ్నాయ ఉద్యమాల్లోనూ ఆయన భాగస్వాములయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అజ్ఞాతంలో గడిపారు. ఎమర్జెన్సీలో 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి, 1990 దాకా అండర్‌గ్రౌండ్‌ ఉద్యమంలో పోరు సాగించారు. 1990 ఫిబ్రవరి 19న ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు.

Leaders Condolence on Gaddar Death : 'గద్దర్​ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'

Gaddar Role in Telangana Movement : 1997 ఏప్రిల్‌ 6న ఆయనపై తూటాల వర్షం కురిసింది. తీవ్రంగా గాయపడినా కోలుకున్నారు. 2004లో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు. 2010 అక్టోబరు 9న దాదాపు 107 ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను స్థాపించి... రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపుని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. తుది శ్వాస విడిచే వరకు జనం కోసమే గద్దర్‌ పాట, ఆట కొనసాగింది.

Gaddar Last Rites with Official Ceremonies : మూగబోయిన ప్రజా ఉద్యమ గొంతుక.. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

గద్దర్​కు ఆ పేరు ఎలా వచ్చిందంటే : గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌ కాగా.. కొంతకాలానికి రావుని తొలగించుకుని గుమ్మడి విఠల్‌గా మారారు. బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో మొదటి పాట ‘ఆపర రిక్షా' అని రాశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనల సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి విఠల్‌ కాకుండా వేరే పేరు రాయాలని భావించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక వెలుగు వెలిగిన గదర్‌ పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకొని తన పేరును మార్చుకున్నారు. ప్రింటింగ్‌లో పొరపాటుగా గద్దర్‌గా ప్రచురితమై నాటి నుంచి అదే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.

ప్రజా యుద్ధనౌకగా బిరుదు పొందిన గద్దర్ : గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక అని 1989లో ఒక సంపాదకుడు సంబోధించగా... అదే ఆయనకు బిరుదుగా మారింది. గద్దర్‌ తన పుట్టిన ఊరిపై రాసిన ‘మై విలేజ్‌ ఆఫ్‌ 60 ఇయర్స్‌' పుస్తకం ఆవిష్కరించలోపుగానే ప్రాణాలు విడిచారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో ‘గద్దర్‌ ప్రజా పార్టీ'ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యంతో కానరాని లోకాలకు తరలివెళ్లిపోయారు.

Gaddar son-in-law reaction : ఐసీయూలోనూ పాటలు పాడటం ఆపలేదు​ : గద్దర్ అల్లుడు

Gaddar songs :'గద్దర్​'కు నంది అవార్డు తెచ్చిపెట్టిన వెండితెర​ సాంగ్స్​ తెలుసా?.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.