ETV Bharat / bharat

చెంపదెబ్బ కొట్టారని రివేంజ్.. పోలీస్​ స్టేషన్​ ముందు బైక్​ తగలబెట్టి.. - దిల్లీలో బైక్​ తగలబెట్టిన యువకుడు

పోలీసులు తనను కొట్టారని ఆగ్రహించిన ఓ డెలివరీ బాయ్​ విధ్వంసం సృష్టించాడు. స్టేషన్ ఎదుట బైక్ తగలబెట్టాడు. ఈ క్రమంలో ఓ దుకాణం సైతం మంటల్లో కాలిపోయింది. మరోవైపు, ఓ బాలిక మూడు రోజుల పాటు బావిలో ఉండి.. ప్రాణాలతో బయటపడింది.

Zomato Delivery boy burn Police booth
youth set fire to police booth in Delhi
author img

By

Published : Oct 26, 2022, 12:47 PM IST

దిల్లీలోని ఖాన్​ మార్కెట్ పోలీస్​ స్టేషన్​ వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. సదరు యువకుడు రాళ్లు రువ్వి స్టేషన్​ను ధ్వంసం చేయడమే కాకుండా ​తన బైక్​ను సైతం తగలబెట్టాడు. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్ల దాడికి పాల్పడ్డాడు. ఆఖరికి నిందితుడిని పట్టుకున్న పోలీసులు రిమాండ్​కు తరలించారు. అతన్ని డెలివరీ బాయ్​గా గుర్తించారు.

అసలేం జరిగింది: శనివారం ఓ ఆర్డర్​ను డెలీవరీ కోసం తీసుకెళ్లేందుకు రెస్టారెంట్​కి వచ్చాడు నదీమ్​. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న ఓ యువతి.. నదీమ్ తనవైపు చూశాడని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుకి స్పందించిన పోలీసులు.. నదీమ్​ను చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు మరుసటిరోజు పోలీస్​ స్టేషన్​ ఎదుట తన బైక్​ను తగలబెట్టాడు. దీంతో పక్కనే ఉన్న ఓ ఫర్నిచర్​ షాపు సైతం మంటల్లో కాలిపోయింది. అంతే కాకుండా ఇటుకలను సైతం పోలీస్ స్టేషన్​పైకి విసిరాడు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపైనా రాళ్లు విసిరాడు. కాసేపటి తర్వాత అతన్ని పోలీసులు ఎలాగోలా అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో యువకుడిని అరెస్టు చేసిన పోలీసుల.. దర్యాప్తు చేపట్టారు.

మూడు రోజులు బావిలో ఉండి..
మూడు రోజులుగా బావిలో ఉండిపోయిన ఓ చిన్నారి.. మృత్యుంజయురాలిగా బయటపడింది. తమ కూతురు ఇక తిరిగి రాదని కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాదాపు మూడు రోజులు బావిలో ఉన్న బాలికను.. స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే... నాగలా సింఘే పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బన్స్​దానీ గ్రామంలో ప్రేమలత అనే మూడేళ్ల బాలిక అక్టోబర్​ 23న కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. చుట్టుపక్కలున్న జనావాస ప్రాంతాలన్నింటినీ గాలించినా బాలిక ఆచూకీ దొరకలేదు.

అలా మూడు రోజులు వెతకగా.. బాలిక ఓ బావిలో కనిపించినట్లు సమచారం అందింది. దీంతో హుటాహుటిన పోలీసులతో పాటు గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాలికను బావిలో నుంచి బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు ఆకలితో ఉన్నప్పటికీ సురక్షితంగా బయటకు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం..
బంగాల్​ గైఘాటాలోని ఓ పాడుబడ్డ గదిలో అస్థిపంజరం బయటపడింది. ఇది 42 ఏళ్ల మనోజ్​ సర్దార్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. అస్థిపంజరం పక్కనున్న దుస్తుల ఆధారంగా మృతుడి భార్య ఈ విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే... ఐదున్నరేళ్ల క్రితం మనోజ్​ కనిపించకుండా వెళ్లిపోగా అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతూ వచ్చారు. ఎంతకీ దొరకకపోయేసరికి పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కంప్లైంట్​ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైతం రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా అతడి జాడ ఎక్కడా దొరకలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల ఆ ప్రాంతంలోని ఓ సంఘం సభ్యులు దుర్గామాత పూజ కోసం పాత ఇంటిని శుభ్రం చేద్దామని వెళ్లగా అక్కడ వారికి ఓ అస్థిపంజరం కనిపించింది.

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇది కచ్చితంగా మనోజ్​దే అయ్యుంటుందని అనుమానించిన పోలీసులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పక్కనే పడి ఉన్న దుస్తుల ఆధారంగా వారు అది మనోజ్​ అస్థిపంజరమే అని నిర్ధరించారు. పోలీసులు ఇది ఆత్మహత్యగా పరిగణిస్తున్నప్పటికీ.. అసలు కారణం తెలుసుకునేందుకు అస్థిపంజరాన్ని పరీక్షలకు పంపించారు.

చిన్నారిపై అత్యాచారం
అభం శుభం తెలియని ఓ ఏడేళ్ల చిన్నారిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. దీపావళి రోజు దుకాణానికి వెళ్లిన బాలిక.. మరుసటి రోజు విగతజీవిగా కనిపించింది. దీంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటన హరియాణాలోని పానిపట్​లో జరిగింది.

హత్యకు ముందు బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పాపను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
గత రెండు నెలల్లో పానిపట్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని స్థానికులు తెలిపారు. రెండు నెలల క్రితం తన సోదరుడితో పార్క్​లో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ఓ నలబై ఏళ్ల వ్యక్తి ఎత్తుకెళ్లి రేప్​ చేసి హతమార్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.