ETV Bharat / bharat

'45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా'

from-1st-april-the-vaccine-will-open-for-everybody-above-45-years-of-age-union-minister-prakash-javadekar
'ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా'
author img

By

Published : Mar 23, 2021, 3:16 PM IST

Updated : Mar 23, 2021, 4:16 PM IST

15:14 March 23

45పైబడిన వారికి టీకా...

కొవిడ్ టీకాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా అందించాలని తీర్మానించింది. 

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు చర్చించి, నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకాశ్ జావడేకర్​ తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో భయాందోళన అక్కర్లేదని భరోసా ఇచ్చారు. అర్హులు కొవిన్ పోర్టల్​లో పేరు నమోదు చేసుకుని కొవిడ్‌ టీకా తీసుకోవాలని సూచించారు.  

"ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మందికి టీకాలు అందజేశాం. రెండో  విడతలో 80 లక్షల మందికి టీకా అందించాం.   ఫిబ్రవరిలో సగటున రోజుకు 3.77 లక్షల  టీకాలు అందించాము. సోమవారం ఒక్క రోజే అది 32 లక్షలు దాటింది."

                 -- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి  

దేశంలో కొవిడ్‌ టీకాల కొరత లేదని స్పష్టం చేశారు జావడేకర్. భారత్​లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని వివరించారు. 

'అందరికీ టీకా ఇవ్వండి'

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వయోపరిమితి లేకుండా అందరికీ టీకా అందించాలని రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు అధిక డోసులను పంపిణీ చేయాలని సూచించారు. అధిక శాతం వ్యాక్సినేషన్​తోనే కరోనా బారి నుంచి ప్రజలను రక్షించవచ్చని తెలిపారు. 24-45ఏళ్ల వయసు వారు ఉద్యోగం కోసం బయటకు వస్తుంటారు కాబట్టి వీలైనంత త్వరగా వారికీ టీకాలు అందించాలని సూచించారు.  

81శాతం మందిలో యూకే స్ట్రెయిన్​  

పంజాబ్​ నుంచి పంపిన 401 శాంపిల్స్​లో 81శాతం మందిలో యూకే వేరియంట్లు ఉన్నాయని తెలిపారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. 60ఏళ్లలోపు వారికి సైతం వ్యాక్సినేషన్​ ఇవ్వాలని సూచించారు. అందరికీ టీకా అందిస్తే వైరస్​ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు

Last Updated : Mar 23, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.