మహారాష్ట్ర అమరావతి సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బద్నేరా-నార్ఖేడ్ మార్గంలో సుమారు 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన అర్థరాత్రి 12.45 ప్రాంతంలో జరిగింది.



ఇంజన్ నంబర్ 2380, 2343 గల గూడ్స్ రైలు బల్లార్షా నుంచి నార్ఖేడ్కు బొగ్గుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే నార్ఖేడ్-భుసవాల్ ప్యాసింజర్, కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.


ఘటనాస్థలాని చేరుకున్న సిబ్బంది ఈ మార్గాన్ని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 150 మంది కార్మికులు దీనిపై పని చేస్తున్నారు.
ఇదీ చూడండి: సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు