ETV Bharat / bharat

'ఉచిత విద్యుత్ అనేది సంక్షేమం కాదు'.. ఎన్నికల్లో వాగ్దానాలపై ఈసీకి భాజపా లేఖ - ఆప్ వర్సెస్ భాజపా

ఉచిత పథకాలు, వాటి సాధ్యాసాధ్యాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. ఉచితాలపై ప్రజలు ఆధారపడేటట్లు చేయడం సరికాదని, బదులుగా ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాలని పేర్కొంది.

eebies by bjp government
ఉచితాలపై భాజపా లేఖ
author img

By

Published : Oct 27, 2022, 2:28 PM IST

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే తాయిలాలు, ప్రజాసంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చే వాగ్దానాలు ఎలా నెరవేర్చుతారనే అంశంపై రాజకీయ పార్టీల నుంచి ఈసీ వివరణ కోరిన నేపథ్యంలో భాజపా ఈమేరకు స్పందించింది. ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాలే తప్ప.. ప్రజలు ఒకరిపై ఆధారపడి జీవించేలా చేయకూడదని భాజపా స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఈసీకి తమ స్పందన తెలియజేసినట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

"ఉచితాలు అనేవి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటించేవి. సంక్షేమం అనేది సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశం. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి ఆర్థిక సాధ్యాసాధ్యాలపై పార్టీల నుంచి ఈసీ నివేదిక కోరడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ప్రజలకు ఇళ్లు, ఉచిత రేషన్ ఇవ్వడం సంక్షేమ కార్యక్రమాలు. వీటిని ఉచితాలుగా పరిగణించలేం. కానీ, ఉచిత విద్యుత్ అనేది ఈ కోవలోకి రాదు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఈసీకి మా స్పందన తెలియజేశాం."
-భాజపా సీనియర్ నేత

ఉచితాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. తమ నుంచి వసూలు చేసిన డబ్బును ఉచితాలకు ఉపయోగిస్తే పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడతారంటూ కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ధరల పెరుగుదలతో బాధపడుతున్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. అటువంటి వాటిని ఉచితాలు అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని హితవు పలికారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.