ETV Bharat / bharat

పెళ్లి.. ఫస్ట్​ నైట్​ డ్రామా.. డబ్బుతో మాయం.. ఏడుసార్లు సీన్​ రిపీట్! - haryana police busted fraud bride

Fraud Bride: పరిచయం.. పెళ్లి.. మొదటి రాత్రే మత్తుమందు ఇవ్వడం.. డబ్బు, నగలతో మాయం.. రిపీట్! ఇలా ఒకటి, రెండు సార్లు కాదు.. మూడు నెలల్లో ఏకంగా 7 సార్లు చేసింది ఓ యువతి. ఏడుగురు పెళ్లి కుమారుల్ని మోసగించి దోచుకుంది. చివరకు పోలీసులకు చిక్కింది.

fraud bride in panipat
నిత్యపెళ్లికూతురు
author img

By

Published : Mar 27, 2022, 1:13 PM IST

Fraud Bride: హరియాణాలో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. యువకులకు గాలం వేయడం.. పెళ్లి చేసుకోవడం.. మొదటిరాత్రే మత్తుమందు ఇవ్వడం.. డబ్బు, నగలతో పారిపోవడం.. ఇలా అక్రమార్జనకు అలవాటు పడింది ఆ ముఠా. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ మోసాలకు పాల్పడింది. ఇలా వరుసగా ఏడో వ్యక్తిని వివాహమాడింది యువతి అంజు(పేరు మార్చాం). బాధితుల్లో నాలుగో వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేసి తీగలాగితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

వారే లక్ష్యంగా..: విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకుల్ని లక్ష్యంగా చేసుకునేది అంజు. వారికి వలపు వల విసిరి తనకు దాసోహం చేసుకుని, పెళ్లి వరకు తీసుకొచ్చేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రే మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో ఉడాయించేది. భర్తకు అనుమానం వచ్చేలోపే తన ప్రణాళికను అమలు చేసేది.

కట్నం వేధింపుల పేరుతో..: పెళ్లైన పదిరోజులు గడిచేలోపు కట్నం వేధింపులు చేస్తున్నారంటూ భర్తను బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు లాగేది అంజు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, తన పెళ్లి ఓ మధ్యవర్తితో జరిగిందని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. ఈ గ్రూపులో ఓ మ్యారేజ్​ ఏజెంట్ భిజేంద్ర సింగ్​ సహా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

చివరికి ఇలా..: అంజు వివాహం చేసుకున్న భర్తల్లో నాలుగో వ్యక్తి నౌల్తాకు చెందిన రాజేందర్. పెళ్లి అనంతరం అంజు.. రాజేందర్​ను మోసం చేసి డబ్బులు, నగలతో పారిపోయింది. దీంతో మోసాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుని అంజు ఐదో భర్త దగ్గరకు వెళ్లాడు. వారు ఆమె నిజస్వరూపాన్ని పసిగట్టేలోపే శనివారం ఏడో వివాహం కూడా చేసేసుకుంది. వీరు ఇచ్చిన ఫిర్యాదుతో అంజును, ఆమె సహచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

వివాహ ప్రయాణం సాగిందిలా..: ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్​ను అంజు మొదటగా పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా అంజును పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్​లో జరిగింది. ఆధార్ కార్డ్​లో తండ్రి పేరు మార్చి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్​తో.. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్​తో.. ఆరో వివాహం కర్నాల్​కు చెందిన సందీప్​తో జరిగింది. చివరగా మార్చి 26న (శనివారం) బుద్వాకు చెందిన సుమిత్​తో అంజూకు ఏడో పెళ్లి జరిగింది.

ఇదీ చదవండి: సముద్రంపై తేలియాడే వంతెన.. నడుస్తుంటే సూపర్ కిక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.