ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన ప్రక్రియ తర్వాత.. ఆ ప్రాంతాన్ని మూడోసారి పలు దేశాల రాయబారులు సందర్శించనున్నారు. బారాముల్లా, గుల్మార్గ్ ప్రాంతాల్లో ఈ నెల 18, 19న పర్యటించి.. కశ్మీర్లో అభివృద్ధి, శాంతి పునరుద్ధరణ ప్రక్రియలను నిశితంగా పరిశీలించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పర్యటకులకు స్వర్గధామాలైన శ్రీనగర్, గుల్మార్గ్లో పర్యటక ప్రోత్సాహక కార్యక్రమాల వివరాలు తెలుసుకోనున్నారని చెప్పాయి.
ఇటీవల డీడీసీ ఎన్నికల్లో గెలిచిన స్థానిక ప్రతినిధులనూ విదేశీ రాయబారులు కలుస్తారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
జమ్ముకశ్మీర్ లోయలో 4జీ పునరుద్ధరణ తర్వాత విదేశీ రాయబారుల బృందం పర్యటించడం ఇదే తొలిసారి కానుంది.