ETV Bharat / bharat

'ఆదిలాబాద్​కు భారీగా ఆయుధాలు.. పాక్​ కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్'

Four Suspected Terrorists Arrested: తెలంగాణలోని ఆదిలాబాద్​ కేంద్రంగా పాకిస్థాన్​ పన్నిన భారీ ఉగ్ర కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్​ నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని అందుకుని ఆదిలాబాద్​కు తరలిస్తున్న నలుగురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మణిపుర్​లో గురువారం తెల్లవారుజామున బాంబు పేలుడు కలకలం సృష్టించింది.

four-suspected-terrorists-arrested-from-karnal

author img

By

Published : May 5, 2022, 1:08 PM IST

Updated : May 5, 2022, 2:59 PM IST

Four Suspected Terrorists Arrested: భారత్​పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్​ తలపెట్టిన మరో భారీ కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, గన్‌పౌడర్ కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు బాగోతం బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదులతో టచ్​లో ఉన్నారు. పాక్​ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్​కు మందుగుండు సామగ్రిని తరలిస్తున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపిందర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గుర్​ప్రీత్​కు ఫిరోజ్​పుర్​ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి. వీరు నాందేడ్​కు పేలుడు పదార్థాలను తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన వర్గాల సమాచారం మేరకు పోలీసులు వారిని బస్తారా టోల్ ప్లాజా సమీపంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గరు ఫిరోజ్‌పుర్‌కు, మరొకరు లుథియానాకు చెందినవారని తెలిపారు. ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.

ఈ ఘటనపై హరియాణా సీఎం స్పందించారు. నిందితులు హరియాణా మీదుగా పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని మనోహర్ లాల్​ ఖట్టర్​ చెప్పారు.

కలకలం రేపిన బాంబు పేలుడు.. మణిపుర్​లో ఓ బాంబు పేలుడు కలకలం రేపింది. ఆ బాంబును ఐఈడీ(ఇంప్రొవైజ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)గా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంపాల్​ వెస్ట్ సిటీలో సచితా కార్ హౌస్ అనే దుకాణం ఎదుట గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు బాంబు పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి షాప్‌లోని కొన్ని సామాన్లు, షాపు దగ్గర పార్క్​ చేసి ఉన్న కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. బాంబ్​ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు మణిపుర్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిపుణుల బృందం పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు, గుజరాత్​లో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 30 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

BOMB
పేలుడు జరిగిన ప్రదేశం
BOMB
పేలుడు ధాటికి ధ్వంసమైన కారు ముందు భాగం

ఇదీ చదవండి: పైన కొండ.. కింద నది.. మధ్యలో శునకం.. చివరకు ప్రాణాలు దక్కాయిలా...

Last Updated : May 5, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.