కర్ణాటకలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చామరాజనగర్ తాలుకా హెచ్. మోకాహళ్లి గ్రామంలో జరిగిందీ ఘటన.
మహదేవప్ప, అతడి భార్య మంగళమ్మ, కూతుళ్లు గీతా, శ్రుతి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రజలు రోడ్లపై నడుస్తూ చనిపోతారు- స్వామీజీ జోస్యం!