ETV Bharat / bharat

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. ఏం జరిగింది? - కర్ణాటక వార్తలు

family found dead in Karnataka: కర్ణాటకలోని మంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. భర్తే.. భార్య, పిల్లలను చంపి ఆ తర్వాత ఆత్మహత్య​ చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

family found dead in Karnataka
ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. ఏం జరిగింది?
author img

By

Published : Dec 9, 2021, 9:30 AM IST

family found dead in Karnataka: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన .. కర్ణాటక మంగళూరులో కలకలం రేపింది. మృతులను నగేశ్​ షేరిగుప్పి(30), అతని భార్య విజయ లక్ష్మి(26), పిల్లలు సప్న(8), సమర్థ్​(4)గా గుర్తించారు.

పిల్లలు, భార్యను నగేశ్​ చంపి.. చివరికి అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంట్లో.. ఉరి వేసుకున్న నగేశ్​ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారు విషం తాగి మరణించారని సమాచారం.

నగేశ్​ డ్రైవర్​ కాగా.. విజయ లక్ష్మి సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తోంది.

ఈ ఘటన బుధవారం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.

భార్య- భర్తల గొడవ!

అక్టోబర్​లో.. ఎవరికీ చెప్పకుండా విజయ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నగేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. భర్తతో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయినట్టు చెప్పింది. దీంతో పోలీసులు ఆ కేసును మూసివేశారు.

ఇదీ చూడండి:- భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.