ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. దివ్యాంగురాలిని చెట్టుకు కట్టేసి.. - నాలుగేళ్ల బాలికపై అత్యాచార యత్నం

Four months girl Molested: బిహార్​లో దారుణం జరిగింది. నాలుగు నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగాల్​లో జరిగిన మరో ఘటనలో దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేశాడు ఓ ప్రబుద్ధుడు.

rape
అత్యాచారం
author img

By

Published : Apr 27, 2022, 7:49 AM IST

Four months girl Molested: నాలుగు నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాలికను ఆడిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బిహార్​ పట్నాలోని దానాపుర్​లో ఈ దారుణ ఘటన జరిగింది. 35 ఏళ్ల సంతోష్​ను నిందితుడిగా గుర్తించారు పోలీసులు. గ్రామస్థులు అతడిని చితకబాది వారికి అప్పగించారు. . నిందితుడు సంతోష్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అత్యాచారం అనంతరం నిందితుడు మొక్కజొన్న పొలంలో దాక్కున్నాడు. గ్రామస్థులు నిందితుడిని వెతికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి నిందితుడు తాతయ్య వరుసవుతాడని పోలీసులు తెలిపారు.

బంగాల్​లోని జల్​పాయ్​గుడిలో మూడు చోట్ల కామాంధులు వరుస దారుణాలకు పాల్పడ్డారు. జిల్లాలోని మేనాగుడిలో సోమవారం ఓ దివ్యాంగ బాలికను కట్టేసి లైంగికంగా వేధించాడు ఓ కామాంధుడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి పక్కింటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మరోవైపు నాలుగేళ్ల బాలికపై 45 ఏళ్ల కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జల్​పాయ్​గుడిలోని సదర్ బ్లాక్​లో జరిగింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలి కుటుంబ సభ్యులు వెళితే పోలీసులు మధ్యాహ్నం 3నుంచి రాత్రి 11గంటల వరకు ఫిర్యాదు నమోదు చేయలేదని వారు అన్నారు.

మనరాళ్ల వయసున్న బాలికపై: 16 ఏళ్ల మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు 60ఏళ్ల వృద్ధుడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జల్​పాయ్​గుడిలోని బెలకోబా ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు అరుపులు విని తల్లి వచ్చేసరికి నిందితుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: మళ్లీ కరోనా కలకలం.. సీఎంలతో ప్రధాని సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.