గుజరాత్లో నాలుగు నెలల చిన్నారి కరోనాను ఓడించాడు. వైరస్ సోకడం వల్ల.. ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి విషమించగా 6 రోజుల పాటు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. కరోనాను జయించి 15 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
అసలేం జరిగిందంటే?
ఆనంద్ జిల్లాకు చెందిన కునాల్ మక్వాన్ కుమారుడు జుగల్(4నెలలు) ఇటీవల అనారోగ్యం బారినపడ్డాడు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నందున.. ఏప్రిల్ 29న టెస్ట్‌లు చేయించగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రాణవాయువు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ శిశువును.. అధిక స్థాయి పౌనఃపున్యం కలిగిన వెంటిలేటర్‌పై ఉంచారు వైద్యులు. అలా 6 రోజులపాటు చికిత్స అందించాక.. తిరిగి మామూలు స్థితికి వచ్చాడా బాలుడు. ఆ తర్వాత పరీక్షలు చేయించగా నెగెటివ్‌గా తేలింది. దీంతో 15 రోజుల పాటు ఆస్పత్రిలో గడిపాక ఆ చిన్నారిని డిశ్ఛార్జ్ చేశారు వైద్యులు.
అంతకుముందు.. జుగల్కు పుట్టినప్పుడే హార్ట్‌లో బ్లాగ్ ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 14న సంబంధిత శస్త్రచికిత్స కూడా జరిగింది. ఫలితంగా.. తన తొలి 51 రోజులు ఆస్పత్రిలోనే గడిపాడు ఆ పసికందు.
ఇదీ చదవండి: చిన్నారులకు కరోనా సోకితే?