ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఐదుగురు ఉగ్రవాదులు హతం - encounter news

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలోని పొంబాయ్​, గోపాల్​పొరా ప్రాంతాల్లో ఎన్​కౌంటర్​(jammu kashmir encounter today) జరిగింది. ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో టీఆర్​ఎఫ్​ కమాండర్​ హతమైనట్లు అధికారులు తెలిపారు.

encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Nov 17, 2021, 5:42 PM IST

Updated : Nov 17, 2021, 7:58 PM IST

జమ్ముకశ్మీర్​, కుల్గాం జిల్లాలోని రెండు ప్రాంతంలో ఎదురుకాల్పులు(jammu kashmir encounter today) జరిగాయి. ఈ ఎన్​కౌంటర్లలో(Encounter news) ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు.

జిల్లాలోని పొంబాయ్​, గోప్లా​పొరా ప్రాంతాల్లో(encounter today in kulgam) ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు జవాన్లు. బలగాలు తారసపడగానే వారిపై కాల్పులకు తెగబడ్డారని, అది ఎన్​కౌంటర్​కు(encounter today) దారితీసినట్లు కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

టీఆర్​ఎఫ్​ కమాండర్​ హతం..

గోప్లాపొరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, అందులో ద రెసిస్టెంట్​ ఫ్రంట్​(టీఆర్​ఎఫ్​) కమాండర్​ అఫాక్​ సికందర్​ ఉన్నట్లు విజయ్​ కుమార్​ తెలిపారు.

ఉగ్ర కుట్ర భగ్నం..

మరోవైపు.. పుల్వామా పోలీసులు, భద్రతా దళాలు కలిసి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. తనిఖీల్లో భాగంగా.. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పని చేస్తున్న అమిర్​ బషీర్​, ముఖ్తార్​ భట్​ను అరెస్ట్​ చేశారు. వారి నుంచి రెండు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: హైదర్​పొరా ఎన్​కౌంటర్​పై కశ్మీర్​లో రగడ- ఆ జిల్లాలో ఆంక్షలు

Last Updated : Nov 17, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.