రాజస్థాన్లోని డున్గర్పుర్ జిల్లా పంచేల్ గ్రామంలో తౌక్టే తుపాను ప్రభావం కారణంగా ఆదివారం సాయంత్రం సంభవించిన పిడుగుపాటుకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో పలు పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.
ప్రభుత్వ సాయం
ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. రూ.నాలుగు లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. గాయపడిన వారికి కూడా తగిన ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కొవిడ్ రిపోర్టు లేక పడక దొరకలేదు.. ప్రాణం ఆగలేదు..