కర్ణాటకలో వైద్యుడిపై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం ఓ వైద్యుడు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్తుండగా.. కొంత మంది అటకాయించి ఆయనపై దాడికి పాల్పడ్డారు. చిక్కమగళూరులోని తారికేరెలో ఈ ఘటన జరిగింది.
తమ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా నిందితులు ఆగ్రహానికి గురయ్యారని చిక్కమగళూరు ఎస్పీ తెలిపారు. దీంతో.. చిన్నారి మృతికి వైద్యుడే కారణమని ఆరోపిస్తూ.. ఆయనపై వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు.
![attacking a doctor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11990528_222.jpg)
![attacking a doctor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11990528_111.jpg)
ఈ ఘటనపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్నారాయణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వైద్యునిపై దాడి చేసిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.