ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో మాజీ ప్రధానికి భారీ జరిమానా - సైన్​ సంస్థకు రూ.2 కోట్లు చెల్లించాలని దేవగౌడకు ఆదేశం

ఓ నిర్మాణ సంస్థకు రూ. 2కోట్లు పరువు నష్టం కింది చెల్లించాలని మాజీ ప్రధాని దేవగౌడకు బెంగళూరులోని సిటీ సివిల్​ అండ్​ సెషన్స్​ కోర్టు ఆదేశించింది. 2012లో ఆ సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

HD Deve Gowda, Defamation case
దేవగౌడ, పరువునష్టం కేసు
author img

By

Published : Jun 22, 2021, 11:53 AM IST

పరువు నష్టం కేసులో మాజీ ప్రధాన మంత్రి దేవగౌడకు బెంగళూరులోని సిటీ సివిల్​ అండ్​ సెషన్స్​ అదనపు న్యాయస్థానం షాక్​ ఇచ్చింది. 2012లో నంది ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కారిడార్​ ఎంటర్‌ప్రైజ్ (నైస్​) అనే సంస్థపై దేవగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సంస్థ పరువుకు భంగం వాటిల్లిందని ఆ కంపెనీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన సివిల్​ కోర్ట్​ న్యాయమూర్తి మల్లన గౌడ రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

గతంలో ట్రయిల్​ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్​ను కొట్టివేసింది. దీనిపై రూ.10కోట్ల నష్టపరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించిన ధర్మాసనం.. విచారించింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడం వల్ల తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.

ఇదీ చూడండి: దీదీ సర్కార్​కు హైకోర్టు షాక్- 'అధ్యయనం కొనసాగించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.