ETV Bharat / bharat

కేరళ కాంగ్రెస్​ (బి) ఛైర్మన్​ కన్నుమూత - బాలకృష్ణ పిళ్లై

కేరళ కాంగ్రెస్​ (బి) ఛైర్మన్ ఆర్.బాలకృష్ణ పిళ్లై సోమవారం కన్నుమూశారు. ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న పిళ్లై.. కేరళ రాష్ట్ర మంత్రిగా, లోక్​సభ సభ్యుడిగా సేవలందించారు.

r balakrishna pillai passes away, బాలకృష్ణ పిళ్లై
ఆర్​ బాలకృష్ణ పిళ్లై
author img

By

Published : May 3, 2021, 10:13 AM IST

కేరళ కాంగ్రెస్ (బి) ఛైర్మన్​, ఆ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్​. బాలకృష్ణ పిళ్లై (86) కొట్టారకరాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. వయసు సంబంధిత వ్యాధుల కారణంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

విద్యార్థి దశలోనే..

ఉన్నత కుటుంబంలో జన్మించిన పిళ్లై.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించారు. స్టూడెంట్​ ఫెడరేషన్ సభ్యుడిగా ఉన్న పిళ్లై.. 1958లో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. 1960లో పతనపురం నియోజకవర్గం తరపున పోటీ చేసి 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1964లో కాంగ్రెస్​ను వీడి సీనియర్​ నేత కేఎం జార్జితో కలిసి కేరళ కాంగ్రెస్​ (బి)ని స్థాపించారు.

1971లో మవేలికర నియోజకవర్గం నుంచి పిళ్లై లోక్​సభకు ఎన్నికయ్యారు.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేరళ మాజీ ముఖ్యమంత్రులు సీ అచ్యుత మేనన్, కే కరుణాకరన్, ఈకే నాయనర్, ఏకే ఆంటోనీల కేబినెట్​లో మంత్రిగా సేవలందించారు.

2017 నుంచి కేరళ స్టేట్​ వెల్​ఫేర్​ కార్పరేషన్ ఫర్​ ఫార్వర్డ్​ కమ్యూనిటీస్​కు ఛైర్మన్​గా సేవలు అందిస్తున్నారు.

అవినీతి ఆరోపణలు..

ఇడమలయర్​ హైడ్రోఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​కు సంబంధించి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 2011 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు పిళ్లై సహా పలువురికి జైలు శిక్ష విధించింది.

ఇదీ చదవండి : పునరపి విజయం- చరిత్ర సృష్టించిన ఎల్​డీఎఫ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.