తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఫొటోకు పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుంటూనే కుప్పుకూలిపోయారు డీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే వీరపాండి రాజా(veerapandi raja news). గుండెపోటు రావటం వల్ల ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు((veerapandi raja death)).
ఇదీ జరిగింది..
డీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే వీరపాండి ఏ రాజా(veerapandi raja mla) శనివారం 59వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సేలంలోని తన నివాసంలో తండ్రి ఫొటోకు పూల మాల వేసేందుకు ప్రయత్నించగా.. గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. రాజాకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
2006లో వీరపాండి నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు రాజా(veerapandi raja mla). అలాగే సేలం జిల్లా పార్టీ ఎన్నికల కమిటీ కార్యదర్శిగా సేవలందించారు. 1982లో డీఎంకేలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు.
సీఎం సంతాపం..
రాజా మృతికి సంతాపం ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు పళనివేల్ త్యాగరాజన్, కేఎన్ నెహ్రూ, పొన్ముడి. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: 'పదవి ఉన్నా, లేకున్నా గాంధీ కుటుంబం వెంటే!'