Former CM KCR Admitted to Yashoda Hospital : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కి యశోద ఆస్పత్రి వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో కాలుజారి కేసీఆర్ పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం పరీక్షల అనంతరం ఆయన శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి, సాయంత్రం చికిత్సను చేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ అధినేతను పరామర్శించేందుకు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, కవిత,కేసీఆర్ సతీమణి శోభా, సంతోశ్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఉదయం నుంచి ఆస్పత్రిలోనే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో యశోద ఆస్పత్రికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డిలు సైతం కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు.
"నిన్న కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం. కేసీఆర్‌కు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. తుంటి ఎముక విరిగిందని చెప్పారు. సాయంత్రం కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స తర్వాత వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. ఆస్పత్రి వద్దకు ఎవరూ రావొద్దని వైద్యులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఆస్పత్రి వద్దకు రావొద్దు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగు పడేందుకు ప్రార్థనలు, పూజలు చేయండి. కేసీఆర్ కోలుకోవడానికి మరో 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు నేతలు సంయమనం పాటించాలి." - హరీశ్‌రావు, మాజీ మంత్రి
-
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని…
">మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని…మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని…
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా : ఇదిలా ఉండగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన, వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని రిజ్వీ రేవంత్‌కు వివరించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తన కుమారుడితో కలిసి యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
-
Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023
చాలా బాధేసింది : కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 'తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను.' అని ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్‌కు గాయం కావడం బాధ కలిగించిందన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
-
Anguished to know that Hon'ble former CM Shri KCR garu sustained an injury.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
I wish and pray for his early recovery and good health.
">Anguished to know that Hon'ble former CM Shri KCR garu sustained an injury.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 8, 2023
I wish and pray for his early recovery and good health.Anguished to know that Hon'ble former CM Shri KCR garu sustained an injury.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 8, 2023
I wish and pray for his early recovery and good health.
MLC Kavitha Tweet on KCRs Injury : కేసీఆర్‌కు గాయం కావడంపై మాజీ మంత్రి, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. 'బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు. మీ అందరి ప్రార్థనలతో నాన్న త్వరలోనే పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశారు.
-
BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Grateful for all the love 🙏🏼
">BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023
Grateful for all the love 🙏🏼BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023
Grateful for all the love 🙏🏼
Chandra Babu Tweet on KCR Injury : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
లోకేేశ్ ట్వీట్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు.
Pawan Kalyan on KCR Injury : కేసీఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలని ఆకాంక్షించారు.
-
Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom
— KTR (@KTRBRS) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi
">Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom
— KTR (@KTRBRS) December 8, 2023
Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpiSri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom
— KTR (@KTRBRS) December 8, 2023
Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi
పార్టీ నేతల పరామర్శ: ఇక విషయం తెలిసిన వెంటనే పలువురు బీఆర్‌ఎస్ నేతలు యశోద ఆసుపత్రికి చేరుకుని తమ అధినేతను పరామర్శిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని, మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్ సహా బీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం కేసీఆర్‌ను పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని ప్రకటించిన వైద్యులు, ఇలాంటి శస్త్ర చికిత్స జరిగినప్పుడు దాదాపు 6 నుంచి 8 వారాల్లో కోలుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.