కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో అభివృద్ధి పేరుతో చేపట్టిన చర్యలపై 93 మంది మాజీ ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్థానిక ప్రజలను సంప్రదించిన తర్వాతే ఆ ప్రాంతానికి తగిన అభివృద్ధి నమూనాను ఎంపికచేయాలని, వారి భద్రత, ఆరోగ్య పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు భరోసా కల్పించాలని సూచించారు. ఆ ప్రాంత భౌగోళిక ప్రత్యేకతను, సాంస్కృతిక భిన్నత్వాన్ని కాపాడాలని కోరారు.
లక్షద్వీప్ పరిపాలనాధికారి పి. కె. పటేల్ చేపట్టిన ప్రత్యేక నియంత్రణ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ ఉన్నతాధికారులు లేఖ రాశారు. దాని ప్రతులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు పంపించారు. జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్ మేనన్, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సర్కార్, విదేశీవ్యవహారాల మాజీ కార్యదర్శి సుజాతా సింగ్, ప్రధాన మంత్రి మాజీ సలహాదారు టి. కె. ఎ. నాయర్, ప్రధాన సమాచార మాజీ కమిషనర్ వజాహత్ హబీబుల్లా తదితరులు లేఖపై సంతకాలు చేశారు.
ఇవీ చదవండి: 'లక్షద్వీప్‌లో స్థానికుల ఆమోదం తర్వాతే కొత్త చట్టాలు'