రాజస్థాన్‌కు చెందిన భాజపా నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు మహవీర్ భాగోరా(73) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఉదయ్‌పుర్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్టు స్థానిక భాజపా అధ్యక్షుడు రవీంద్ర శ్రీమాళి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఖేవారా ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
2004-09 మధ్యకాలంలో సాలుంబర్ భాజపా ఎంపీగా సేవలందించారు భాగోరా. అంతకముందు 1993-98 వరకు ఎమ్మెల్యేగానూ పనిచేశారు.
భాగోరా మృతిపై ఆ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా సంతాపం తెలిపారు.
పుదుచ్చేరి ఎమ్మెల్యే మృతిపై మోదీ సంతాపం..
పుదుచ్చేరి ఎమ్మెల్యే, భాజపా నేత కేజీ శంకర్(70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పుదుచ్చేరి అభివృద్ధిలో, పార్టీని బలోపేతం చేయడంలో శంకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం