ETV Bharat / bharat

తాగి వేరే ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. చితకబాదిన యజమాని! - మాజీ ఎంపీ గోపాలకృష్ణన్‌పై దాడి

అనుకోకుండా తన ఇల్లు అనుకొని మరో ఇంట్లోకి ప్రవేశించిన ఓ మాజీ ఎంపీపై దాడి జరిగింది. ఆయనను దొంగ అని భావించిన ఇంటివారు చితకబాదారు. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

mp assaulted
మాజీ ఎంపీ
author img

By

Published : Nov 6, 2021, 11:02 AM IST

అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్​ను ఓ ఇంటి జయమాని చితకబాదాడు. మద్యం మత్తులో వేరే ఇంట్లోకి వెళ్లడం వల్లే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

mp assaulted
తనపై దాడి జరిగిందని చూపుతున్న ఎంపీ

దీపావళి పండుగరోజు మద్యం సేవించిన గోపాలకృష్ణన్.. పొరపాటున నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించాడు. అయితే ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి యజమాని గోపాలకృష్ణపై దాడి చేశాడు. అంతేగాక ఈ ఘటనను సెల్​ఫోన్​లో రికార్డు చేశాడు. కూనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'తమతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని.. ఆయన మాజీ ఎంపీ అని తెలియదని' ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. అనంతరం ఆయనను కూనూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చగా, గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పేర్కొనడం గమనార్హం.

mp assaulted
గోపాలకృష్ణన్

గోపాలకృష్ణన్ 2014-19 కాలంలో నీలగిరి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే ఎంపీగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.