ETV Bharat / bharat

బంగాల్​ బరి: అలజడుల నందిగ్రామ్​లో గెలుపెవరిది? - నందిగ్రామ్​

2007 ఉద్యమం అనంతరం మళ్లీ వార్తల్లో నిలిచింది 'నందిగ్రామ్​'. అయితే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. నందిగ్రామ్​ నుంచి బంగాల్​ ఎన్నికల బరిలో నిలుస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఒకప్పుడు మమత నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్న సువేందు అధికారి.. టీఎంసీని వీడి భాజపా తీర్థం పుచ్చుకోవడం, ఆయన అదే నందిగ్రామ్​ నుంచి పోటీ చేసే అవకాశం ఉండటం రాజకీయంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నందిగ్రామ్​వాసులు ఎవరివైపు నిలబడతారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

"Forgotten" Nandigram stands divided between its favourite Mamata di and Suvendu da
బంగాల్​ బరి: అలజడుల నందిగ్రామ్​లో గెలుపెవరిది?
author img

By

Published : Jan 24, 2021, 5:48 PM IST

నందిగ్రామ్​... ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హింస, రక్తపాతం. బంగాల్​లోని ఈ ప్రాంతంలో దశాబ్దం క్రితం జరిగిన అల్లర్లే ఇందుకు కారణం. ఆ తర్వాత పరిస్థితులు మారి ఆ ప్రాంతానికున్న ప్రాముఖ్యం తగ్గింది. కానీ బంగాల్ శాసనసభ​ ఎన్నికల వేళ ఇప్పుడు నందిగ్రామ్​ మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకు కారణం బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమెకు గతంలో అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి.

ఇంతకీ... నందిగ్రామ్ ప్రజల ఓటు ఎవరికి?

2007 ఘర్షణతో..

నందిగ్రామ్​ ప్రస్తావన వస్తే... ముందుగా 2007లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకోవాలి. ఆ ప్రాంతాన్ని కెమికల్​ హబ్​గా మార్చేందుకు నిర్ణయించిన నాటి వామపక్ష ప్రభుత్వం.. రైతుల నుంచి భారీ మొత్తంలో భూములను తీసుకునేందుకు ప్రణాళికలు రచించింది. ఇందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఒకానొక సందర్భంలో రైతులు-పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగి అనేకమంది మరణించారు. చివరకు ప్రభుత్వం దిగొచ్చి తన ప్రణాళికను విరమించుకుంది.

ఇదీ చూడండి:- బంగాల్​ గడ్డ మీద తృణమూల్​కు భాజపా 'సవాల్​'

కానీ అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఉద్యమాన్ని సమర్థంగా నడిపించిన మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇదే వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చి టీఎంసీని అధికారంలో నిలబెట్టేందుకు ఉపయోగపడింది.

ఇందులో సువేందు అధికారిదీ కీలకపాత్రే. మమత వ్యూహరచనలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసిన సువేందు.. టీఎంసీ విజయానికి దోహదపడ్డారు. అనంతరం నందిగ్రామ్​ నుంచే అసెంబ్లీకి ఎన్నికై​ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

చీలిక...

2007లో సంచలనాలకు కేంద్రంగా మారిన నందిగ్రామ్​.. క్రమక్రమంగా చీకటిలోకి జారిపోయింది. ఆ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మమత- సువేందు మధ్య శతృత్వంతో ఇన్నేళ్లకు ఈ పేరు మళ్లీ మారుమోగిపోతోంది.

ఇదీ చూడండి:- బంగాల్​ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?

అంతేకాకుండా.. టీఎంసీ కంచుకోట అయిన నందిగ్రామ్​ రెండుగా చీలిపోయింది. సువేందు అధికారి భాజపాలో చేరడం వల్ల ఆయన మద్దతుదారులు, అనేక మంది కార్యకర్తలు టీఎంసీ జెండాను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు.

ఎన్నికల మాటేంటి?

ఈ క్రమంలో సువేందుపై గురిపెట్టిన దీదీ.. బంగాల్​ ఎన్నికల పోరులో నందిగ్రామ్​ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సువేందు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

కానీ తాను మాత్రం వెనకడువేయనని.. నందిగ్రామ్​ నుంచే పోటీ చేసి మమతపై భారీస్థాయిలో విజయం సాధిస్తానని తేల్చిచెప్పారు సువేందు. ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వీడతానని ప్రతిజ్ఞ చేశారు. దీంతో నందిగ్రామ్​ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

మమతకు కష్టమే!

14ఏళ్ల పాటు టీఎంసీ కంచుకోటగా ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో అక్కడి ప్రజలకు మమతపై అసంతృప్తి పెరిగిపోయింది. తమను పక్కనపెట్టారని అనేకమంది నందిగ్రామ్​వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నేళ్లల్లో మమత నందిగ్రామ్​లో పర్యటించిన సందర్భాలు చాలా అరుదు అని గుర్తుచేస్తున్నారు.

దీనికి తోడు ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటం టీఎంసీకి ప్రతికూలంగా మారింది.

ఇదీ చూడండి:- 'దీదీ మాఫియా సభ్యులకు భాజపాలోకి నో ఎంట్రీ'

కానీ మమత రాకతో సమీకరణలు మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ఆమె కాకుండా వేరే ఎవరు పోటీ చేసినా టీఎంసీ కోట కూలిపోయేదని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు టీఎంసీ- భాజపా గెలుపు 50-50 అని భావిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికీ భాజపాదే విజయం అనేవాళ్లూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే 'తోమర్​ నామ్​, అమర్​ నామ్​, నందిగ్రామ్​, నందిగ్రామ్​(నీ పేరు, నా పేరు, నందిగ్రామ్​, నందిగ్రామ్​!)' నినాదం స్థానంలో 'జైశ్రీరాం' నినాదం ఊపందుకుంది. అక్కడి గోడలపైనా ఇదే నినాదం కనిపిస్తోంది.

అయితే నందిగ్రామ్​లోని పలువురు ఇప్పటికీ మమత వెన్నంటే ఉన్నారు. నందిగ్రామ్​ ఉద్యమంలో ఆమె పాత్ర ఎన్నటికీ మరిచిపోలేనిది అని అంటున్నారు.

అదే సమయంలో మమత, సువేందు తమకు తల్లి, కొడుకు లాంటి వారని, ఎవరికి ఓటు వేయాలో అర్థంకావడం లేదనే వారూ ఉన్నారు.

ఎన్నికలపై 'మతం' ప్రభావం?

2007 హింసాకాండలో.. రక్తపాతాలు చూసినా, శాంతికి తూట్లుపడినా.. వారందరూ కలిసిగట్టుగానే ముందుకు సాగారు. 'మతం' అనే ప్రస్తావనే లేకుండా పోరాటం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

"ఒక్కప్పుడు అన్ని వర్గాల వారు కలిసిగట్టుగా జీవించే వారు. అప్పుడు విభేదాలు, హింస నెలకొన్నా.. అది రాజకీయం పరంగానే కానీ మతం పరంగా ఉండేది కాదు. కానీ 6-7ఏళ్లలో నందిగ్రామ్​ చాలా మారిపోయింది. హిందువులు మెజారిటీగా, ముస్లింలు మైనారిటీలుగా చీలిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు."

--- రసూల్​ కాజీ, స్థానికుడు.

అయితే ఇందుకు కారణం కూడా టీఎంసీనే అని మరికొందురు అభిప్రాయపడుతున్నారు. ముస్లింలకు ప్రాధాన్యమిచ్చి.. మమత ప్రభుత్వం హిందువులను పట్టించుకోవడం మానేసిందని ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు ఖండించారు. లౌకికవాదాన్నే టీఎంసీ ప్రోత్సహిస్తుందని తేల్చిచెప్పారు. అదే లౌకికవాదంతో నందిగ్రామ్​లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- 'భాజపా.. మావోయిస్టుల కంటే ప్రమాదకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.