ETV Bharat / bharat

గంగానది ప్రక్షాళన కోసం 5,900 కిలోమీటర్లు కాలినడక - గ్రీన్​ ఇండియా

గంగానది ప్రక్షాళన కోసం 5,900 కిలోమీటర్లు కాలినడక కార్యక్రమం చేపట్టింది అతుల్య గంగ మిషన్​ బృందం. ప్రజలకు గంగానది సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ganga
గంగానది, ప్రక్షాళన
author img

By

Published : Jun 24, 2021, 4:25 PM IST

గంగానది ప్రక్షాళన కోసం.. 'అతుల్య గంగ మిషన్' పేరిట చేపట్టిన కాలినడక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు 5,900 కిలోమీటర్లు ప్రయాణించిన వ్రిక్షమాల్ అభియాన్, ముంద్​మల్ గంగ పరిక్రమ సభ్యులు బుధవారం ప్రయాగ్​రాజ్​ చేరుకున్నారు. జూసి సముద్ర కూప్​ వద్ద గంగా నదికి మహా హారతి ఇచ్చి కాలినడక కార్యక్రమాన్ని ముగించినట్లు పేర్కొన్నారు.

cleanliness of river ganga
5,900 కిలోమీటర్లు నడిచిన బృందం
river ganga cleanliness
ప్రయాగ్​రాజ్​ చేరుకున్న సభ్యులు

2020లోనే..

గతేడాది డిసెంబర్​ 15న ప్రయాగ్​రాజ్​ నుంచి ఈ కాలినడక కార్యక్రమాన్ని ప్రారంభించారు అతుల్య గంగ మిషన్ వ్యవస్థాపకులు, ఆర్మీ మాజీ అధికారి గోపాల్ శర్మ. లెఫ్ట్​నెంట్ కల్నల్ హేమ్ లోహ్మి, కల్నల్ మనోజ్ కేశ్వార్​ ఇందులో కీలక పాత్ర పోషించారు. గంగానది పరిరక్షణ గురించి ప్రజలకు తెలిసేలా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నది సమీప గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి గంగా నది పరిశుభ్రతపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

cleanliness of river ganga
గంగానది ప్రక్షాళన కోసం..
mundmal parikrama
కాలినడకన వెెళ్తున్న ముంద్​మల్ గంగ పరిక్రమ సభ్యులు

"గంగా నదిని సంరక్షించుకోవడానికి ప్రజలు, ప్రభుత్వం ఐక్యంగా పనిచేయాలి. జల ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ అతుల్య గంగ మిషన్​తో పాటు.. వ్రిక్షమాల్ అభియాన్ పేరిట విజయ్ మిశ్రా, కాలేశ్వర్ మిశ్రా ఆధ్వర్యంలో 'గ్రీన్ ఇండియా ఫౌండేషన్' పేరిట కార్యక్రమాలు చేపట్టాం."

--గోపాల్ శర్మ, మిషన్ వ్యవస్థాపకులు.

గ్రీన్​ ఇండియా లక్ష్యంగా..

గంగానది పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగానే వ్రిక్షమాల్ అభియాన్ సభ్యులు 35,000 వేల మొక్కలు నాటారు. దాదాపు 47,000 మొక్కలను ప్రజలకు పంచారు. గ్రీన్ ఇండియా ఫౌండేషన్ పేరుతో 76,000 మంది విద్యార్థులు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగా నది ఒడ్డున వీరు చెట్లు నాటారు.

ఇదీ చదవండి:గంగా నదిలో.. కరోనా ఆనవాళ్లపై అధ్యయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.