ETV Bharat / bharat

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రజలకు సీఎం వార్నింగ్​

Maharashtra covid cases: మహారాష్ట్రలో కొవిడ్​ కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 1,045కేసులు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్దవ్​ ఠాక్రే.. మరోసారి ఆంక్షలు పెట్టకూడదని భావిస్తే.. కచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.

Maharashtra covid cases
Maharashtra covid cases
author img

By

Published : Jun 2, 2022, 10:54 PM IST

Maharashtra covid cases: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం 1,801 కేసులు నమోదు కాగా.. గురువారం 1,045 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒకరు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 4,559కు పెరిగింది. దీంతో మొత్తం కేసులు 78,89,212 నమోదు కాగా.. మరణాల సంఖ్య 1,47,861కు చేరింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. బుధవారం 739 కేసులు నమోదుకాగా.. గురువారం 704 కొత్త కేసులు వెలుగుచూశాయి.

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి ఉద్దవ్​ ఠాక్రే స్పందించారు. మరోసారి ఆంక్షలు పెట్టకూడదని భావిస్తే.. కచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు, సానిటైజర్​, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందస్తుగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని.. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు వ్యాక్సిన్​ వేసుకోవాలని కోరారు. లక్షణాలు కలిగినవాళ్లు టెస్టులు చేసుకోవాలని సూచించారు.

delhi corona cases: దేశ రాజధాని దిల్లీలో గురువారం 373 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కేసులు సంఖ్య 19,07,637 కు పెరగగా.. మరణాల సంఖ్య 26,212కు చేరింది. పాజిటీవిటి రేటు 1.85 శాతంగా ఉంది.

Covid 19 India: దేశంలో కొద్ది నెలలుగా కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2000 నుంచి 3000 మధ్యే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ సంఖ్య మారే అవకాశం ఉంది. కరోనా మొదటి, రెండో దశల్లోనూ మహారాష్ట్రనే తీవ్రంగా ప్రభావితమైంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఆ రాష్ట్రానివే సగం ఉండేవి. ఇప్పుడు మళ్లీ అక్కడ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే విషయమే. అయితే గతంలోలా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకపోవడం ఊరటనిచ్చే అంశం. చిన్నారులు, వయోజనులు సహా అందరు టీకాలు తీసుకొని ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగింది. కరోనా వచ్చినా స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయి. పెద్దగా ఇబ్బంది లేకుండానే నయం అవుతోంది.

రెండు డోసులు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు మూడో డోసు కూడా తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే చెప్పింది. అయితే 60 ఏళ్లు పైబడిన వారికే బూస్టర్​ డోసు ఉచితంగా అందిస్తోంది. 18- 60 ఏళ్ల వారు మాత్రం ప్రైవేటు కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చని చెప్పింది. బూస్టర్ డోసు తీసుకుంటే రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతున్నందు వల్ల కరోనా మరోసారి విజృంభించినా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు లేవు.

  • దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,64,544
  • మొత్తం మరణాలు: 5,24,641
  • యాక్టివ్​ కేసులు: 19,509
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,20,394

Vaccination India: దేశవ్యాప్తంగా బుధవారం 12,44,298 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,70,51,104కు చేరింది. ఒక్కరోజే 4,41,989 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇదీ చదవండి: భారత్​లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 'కిమ్'​ రాజ్యంలో ఒక్కరోజే లక్ష​మందికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.