ETV Bharat / bharat

Vaccination: '69% మందికి టీకా​ ఒక డోసు పూర్తి' - దేశంలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారిలో 69శాతం మందికి కనీసం ఒక డోసు టీకా(Vaccination Status In India) అందించినట్లు కేంద్రం వెల్లడించింది. 25 శాతం మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు చెప్పింది. బూస్టర్ డోసు ఇప్పుడప్పుడే దేశంలో అవసరం లేదని అభిప్రాయపడింది. మరోవైపు.. కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 15వేల కేసులు వెలుగు చూశాయి.

vaccination in india
దేశంలో వ్యాక్సినేషన్
author img

By

Published : Sep 30, 2021, 10:49 PM IST

కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్‌ పంపిణీ(Vaccination Status In India) కార్యక్రమం కొనసాగుతోందని.. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 69శాతం మందికి కనీసం ఒక డోసు టీకా(Vaccination Status In India) అందించినట్టు కేంద్రం వెల్లడించింది. 25శాతం మందికి రెండు డోసులూ పూర్తిచేసినట్టు తెలిపింది.

గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 59.66శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం కేరళలో లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం మీడియాకు వివరించారు.

"కొవిడ్‌ పరీక్షలు తగ్గించలేదు. ప్రతిరోజు 15 లక్షల నుంచి 16లక్షల మేర శాంపిల్స్‌ టెస్ట్‌ చేస్తున్నాం. 30 జిల్లాల్లో కొవిడ్ వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగానే ఉంది. మరో 18 జిల్లాల్లో ఇది 5 నుంచి 10శాతంగా ఉంది. జనసాంద్రత పెరిగే ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అనవసర ప్రయాణాలు మానుకోవడమే తెలివైన పని. తక్కువ సంఖ్యలో పాల్గొని పండుగలు జరుపుకోవాలి."

-కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

"జైకోవ్‌-డి మూడు డోసుల్లో ఇచ్చే వ్యాక్సిన్‌. సూదిని వినియోగించకుండా ఇచ్చే ఈ టీకా ధర ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాటి ధరలకు భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నాం"అని అధికారులు తెలిపారు.

బూస్టర్​ డోసు ఎప్పుడంటే..?

దేశంలోని వయోజనులందరికీ.. పూర్తి స్థాయిలో టీకా పంపిణీ చేయడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని ఐసీఎంఆర్​ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు. బూస్టర్ డోసు ఇప్పడప్పుడే అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

89 కోట్ల డోసులు..

దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 89 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజే 58లక్షల పైగా టీకా డోసులు అందించినట్లు చెప్పింది.

కేరళలో మళ్లీ పెరిగిన కేసులు

కేరళ రోజువారీ కరోనా కేసుల(Kerala Covid Cases) సంఖ్య మళ్లీ పెరిగింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 15,914 కేసులు(Kerala Covid Cases) వెలుగు చూశాయి. మరో 122 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో 16,758 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 3,063 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో కొత్తగా 1,612 కేసులు నమోదయ్యాయి. మరో 17 మంది మృతి చెందారు.
  • ఒడిశాలో కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • మిజోరంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 1,741 మంది కరోనా బారిన పడ్డారు. మరొకరు వైరస్​కు బలయ్యారు.
  • బంగాల్​లో 749 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 15 మంది వైరస్ కారణంగా మరణించారు.
  • కర్ణాటకలో కొత్తగా 933 కేసులు నమోదు కాగా.. మరో 14 మంది మరణించారు.
  • గోవాలో కొత్త 113 మందికి కరోనా సోకింది. మరో ఇద్దరు వైరస్​ కారణంగా మరణించారు.

ఇదీ చూడండి: Corona: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం... నలుగురు ఉపాధ్యాయులకు వైరస్

ఇదీ చూడండి: ప్రభుత్వ కళాశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.