ETV Bharat / bharat

పూలతో ప్రపంచ రికార్డులు.. 7గంటల్లో 108 కిరీటాలు​ తయారీ - ఫ్లవర్​ బ్యాండ్ తయారీలో రికార్డ్

Flower Crown World Record: పూలతో ప్రపంచ రికార్డులు నెలకొల్పారు మహారాష్ట్రకు చెందిన ఫ్లోరల్ ఆర్టిస్ట్ స్వాతి గడేవర్. కేవలం 7గంటల్లోనే 108 పూల కిరీటాలను తయారు చేశారు. తన 50వ పుట్టినరోజునే ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని స్వాతి తెలిపారు.

flower crown world record
ఫ్లవర్ బ్యాండ్
author img

By

Published : Dec 28, 2021, 5:01 PM IST

Updated : Dec 28, 2021, 7:11 PM IST

పూలతో ప్రపంచ రికార్డులు

Flower Crown World Record: మహారాష్ట్ర నాగ్​పుర్​కు చెందిన ప్రముఖ ఫ్లోరల్ ఆర్టిస్ట్ స్వాతి గడేవర్.. పూలతో అరుదైన రికార్డు సాధించారు. కేవలం ఏడు గంటల్లోనే 108 ఫ్లవర్​ బ్యాండ్స్​లను తయారు చేసి ఒకేసారి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​, ఏషియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించారు.

flower crown world record
పూల కిరీటాలను చేస్తున్న స్వాతి
flower crown world record
ఫ్లోరల్ ఆర్టిస్ట్ స్వాతి గడేవర్ చేసిన పూల కిరీటం

మొదట 7 గంటల్లో 100 పూల కిరీటాలను తయారుచేయాలని భావించగా.. అనుకున్న సమయం కంటే నాలుగు నిమిషాల ముందే.. 108 ఫ్లవర్ బ్యాండ్స్​ను తయారు చేసి ఔరా అనిపించారు స్వాతి. ఈ అరుదైన రికార్డులను తన పుట్టినరోజునే అందుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

"సోమవారం నా 50వ పుట్టినరోజు. ఈసారి ఏదైనా స్పెషల్​గా చేద్దామని రెండేళ్ల క్రితమే నిశ్చయించుకున్నా. ఫ్లోరల్ ఆర్టిస్ట్​ను కాబట్టి.. పూల కిరీటాలను తయారు చేద్దామనుకున్నా. చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. ఇండియా, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు పొందాను. గతంలో ఒక్కో కిరీటం చేయడానికి అరగంట సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లోనే తయారు చేస్తున్నా."

-- స్వాతి గడేవర్, ఫ్లోరల్ ఆర్టిస్ట్

స్వాతి గడేవర్​కు పూలతో వివిధ రకాల డెకరేషన్​లు, పూలమాలలు తయారు చేయడం ఇష్టం. క్రమంగా అదే ఇష్టాన్ని తన వృత్తిగా మార్చుకున్నారు.

flower crown world record
ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో చోటు

ప్రస్తుతం ఆమె తయారు చేసే ఫ్లవర్ బ్యాండ్స్, ఇతర డెకరేషన్లకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్స్​, సృజనాత్మకతతో కూడిన పూల కిరీటాలను ఆమె మార్కెట్​లోకి తీసుకొస్తున్నారు.

ఇదీ చూడండి: 29 ఏళ్లు పాక్​ జైల్లో మగ్గి.. ఎట్టకేలకు స్వదేశానికి...

Last Updated : Dec 28, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.