గుజరాత్లో మ్యూకర్మైకోసిస్(fungus) పంజా విసురుతోంది. సూరత్‌లో ఈ ఫంగస్(fungus)లోని ఐదు వేరియంట్లు వెలుగు చూశాయి. రిజోపస్, రిజోమ్యూకర్, అబ్సిడియా, సిన్సెఫలాస్ట్రమ్, సక్సేనియాగా వాటిని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ ఫంగస్(fungus)లో 200 వేరియంట్లు ఉన్నాయని చెప్పారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తరహా ఫంగస్ కేసులు వెలుగు చూశాయని కిరణ్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, మైక్రోబయాలజిస్టు డాక్టర్ మెహుల్ పంచల్ చెప్పారు. మ్యుకోరియా అంటే వైట్ ఫంగస్(white fungus) అన్న ఆయన.. ఇప్పటివరకు ఈ ఫంగస్‌లో 200 రకాలు వెలుగు చూశాయని తెలిపారు. ఫంగస్ రంగును బట్టి.. వ్యాధి తీవ్రతను అంచనా వేయలేమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి'
ఇదీ చూడండి: గాలి ద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి- వాటిపైనా ప్రభావం!