ETV Bharat / bharat

రూ.2 లంచం .. 37 ఏళ్లు విచారణ.. నిర్దోషులుగా బయటపడ్డ ఐదుగురు పోలీసులు

five Police man Acquitted After 37 Years : బిహార్​లో 37 సంవత్సరాల తరువాత ఐదుగురు పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. చెక్​పోస్ట్​ వద్ద వాహనాల నుంచి అక్రమంగా రెండు రూపాయలను వసూలు చేస్తున్నారని అప్పట్లో వీరిపై కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే?

5-policemen-acquitted-after-37-years-in-bihar-taking-two-rupees-bribe-case-caught-by-sp
రూ.2 లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల తర్వాత నిర్దోషులని తీర్పు
author img

By

Published : Aug 3, 2023, 12:44 PM IST

five Police man Acquitted After 37 Years : రెండు రూపాయలను అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలారు. సరైన సాక్షాధారాలు లేని కారణంగా ఆ ఐదుగురిని నిరపరాధులుగా ప్రకటించింది కోర్టు. 1986లో జరిగిన ఘటనపై.. బిహార్​లోని ఓ కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. వాహనదారుల నుంచి పోలీసులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండగా.. అప్పటి బెగుసరాయ్ జిల్లా ఎస్పీ వీరిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి రామరతన్ శర్మ, కైలాష్ శర్మ, జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్​ అనే ఐదుగురు పోలీసులపై ముఫాసిల్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. అనంతరం భాగల్​పుర్​ విజిలెన్స్ కోర్టులో పలు దఫాలుగా విచారణ జరిగింది. పోలీసులు నేరం చేశారనే ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

ఆ రోజు ఏం జరిగింది..
1986 జూన్ 10న.. రాత్రి సమయంలో భాగల్​పుర్​ పరిధిలో ఓ చెక్​పోస్ట్ ఐదుగురు పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారుల నుంచి 2 రూపాయలను అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అప్పటి బెగుసరాయ్ ఎస్పీ అరవింద్ వర్మకు ఫిర్యాదు అందింది. ఆ పోలీసులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని భావించిన ఎస్పీ.. అందుకు ఓ ప్రణాళిక రూపొందించారు.

చెక్​పోస్ట్​ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపిన ఎస్పీ.. రెండు రూపాయల నోటుపై సంతకం చేసి దాన్ని డ్రైవర్​కు ఇచ్చారు. పోలీసులు లంచం అడిగితే.. ఆ నోటును వారికి ఇవ్వమన్నారు. అనంతరం వాహనం చెక్​పోస్ట్ వద్దకు వెళ్లగానే.. డ్రైవర్​ నుంచి రూ.2 డిమాండ్​ చేశారు పోలీసులు. దీంతో ఎస్పీ సంతకం చేసిచ్చిన ఆ నోటును ఓ కానిస్టేబుల్​కు ఇచ్చాడు డ్రైవర్. అనంతరం తిరిగొచ్చి మొత్తం విషయాన్ని ఎస్పీకి తెలియజేశాడు. వెంటనే చెక్​వద్ద వద్దకు వెళ్లిన ఎస్పీ.. ఓ జవాన్ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన రెండు రూపాయల నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక సీఐను ఆదేశించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.