ETV Bharat / bharat

కేరళలో మరో ఐదుగురికి జికా వైరస్ - కేరళలో జికా వైరస్ కేసులు

కేరళలో మరో ఐదుగురికి జికా వైరస్(Zika virus)​ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా వైరస్​ కేసుల సంఖ్య 28కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు(Corona cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Zika virus
జికా వైరస్​
author img

By

Published : Jul 15, 2021, 11:18 AM IST

Updated : Jul 15, 2021, 11:41 AM IST

కేరళ రాజధాని తిరువనంతపురంలో మరో ఐదుగురికి జికా వైరస్(Zika virus)​ సోకినట్లు తేలింది. వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. తాజా బాధితులతో మొత్తం జికా కేసుల సంఖ్య 28కి చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​ వెల్లడించారు.

తాజా కేసుల్లో రెండు.. వైరస్ వ్యాప్తికి కేంద్రమైన అనయారాకు మూడు కిలోమీటర్లు దూరంలో బయటపడినట్లు వీణ తెలిపారు. "మొత్తం 21 నమూనాలు పరీక్షించగా.. ఐదుగురికి జికా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది" అని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.

కరోనా కేసుల్లో పెరుగుదల

మరోవైపు, కేరళలో కరోనా వైరస్(Corona Virus) విజృంభిస్తోంది. ఆ రాష్ట్రం మొదట్లో వైరస్‌ను కట్టడి చేసి ఆదర్శంగా నిలిచింది. కానీ, రెండోదశలో మాత్రం భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూశాయి. తర్వాత అవి తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి జులై 17, 18 తేదీల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తాజాగా అక్కడ 15వేలమందికి వైరస్ సోకింది.

ఇదీ చూడండి: కరోనాతో కుదేలైన ఆ రాష్ట్రంపై జికా పంజా!

Last Updated : Jul 15, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.