ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని ఐదుగురు దారుణ హత్య- ఏం జరిగింది?

Mandya murder case: కర్ణాటక మండ్య జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. బంగారం, ధనం కోసం.. కనికరం లేకుండా చంపేశారు.

Five members of same family killed in Madya district, Karnataka
ఐదుగురు హత్య
author img

By

Published : Feb 6, 2022, 12:06 PM IST

Updated : Feb 6, 2022, 3:07 PM IST

Mandya murder case: కర్ణాటకలోని మండ్యలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఓ మహిళ, నలుగురు చిన్న పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని కేఆర్‌ఎస్ సమీపంలోని బజార్ లైన్‌లో ఈ విషాద ఘటన జరిగింది. మృతులను గంగారాం భార్య లక్ష్మీ(30), వారి పిల్లలు రాజు(12), కోమల్(7)​, కునాల్(4), గంగారాం సోదరుడి కుమారుడు గోవింద్​గా(12) గుర్తించారు.

గంగారాం, అతడి సోదరుడు గణేశ్.. ప్లాస్టిక్​ అలంకరణ సామగ్రి వ్యాపారులు. కర్ణాటకలోనే కాకుండా.. వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటారు. ఒక్కోసారి తిరిగివచ్చేందుకు 15-30 రోజులు పడుతుంది. ఈ క్రమంలోనే.. గంగారాం రెండు రోజులుగా ఊళ్లో లేడు. ఇది తెలుసుకున్న కొందరు దుండగులు.. అతడి ఇంట్లోకి చొరబడి నిద్రలోనే గంగారాం కుటుంబసభ్యులను దారుణంగా చంపేశారు.

భారీగా నగలు, డబ్బు తీసుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఓ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి: ముగ్గురు పాక్​ స్మగ్లర్లు హతం.. 36 కిలోల హెరాయిన్​ స్వాధీనం

Last Updated : Feb 6, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.