ETV Bharat / bharat

కారు-లారీ ఢీకొని ఐదుగురు మృతి: హత్యా? ప్రమాదమా? - మిస్టరీ కారు ప్రమాదం

కేరళలో కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. రామనట్టుకర ప్రాంతానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం వెనుక పెద్ద మిస్టరీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదంతో సంబంధమున్నట్లు భావిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Mystery accident
కారు ప్రమాదం
author img

By

Published : Jun 21, 2021, 6:37 PM IST

Updated : Jun 21, 2021, 8:02 PM IST

ప్రమాదంలో ధ్వంసమైన కారు

కేరళ కొజికోడ్​ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కొజికోడ్​-పాలక్కడ్​ రహదారిపై పులింజేడే ప్రాంతంలో బొలేరో.. సిమెంట్​ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నాజీర్​, సుబైర్​, మహ్మద్​ జహీర్​, అజైనర్​, తహీర్​లో అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా పాలక్కడ్​ వాసులకు అధికారులు గుర్తించారు. కాలికట్​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మిస్టరీ యాక్సిడెంట్​

అయితే ఈ ఘటన వెనుక పెద్ద మిస్టరీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదంతో సంబంధమున్నట్లు భావిస్తున్న కొందరిని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించిన అధికారులు.. ఓ వాహనాన్ని సీజ్​ చేశారు. అలాగే నిందితులను విచారిస్తున్నారు.

గోల్డ్​ స్మగ్లింగ్​ మాఫియాతో సంబంధాలు!

ప్రమాదానికి గురైన వాహనం సహా మూడు వాహనాల్లో 15 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో వారాంతపు లాక్​డౌన్​ ఉండగా.. రాత్రి సమయంలో చెర్పులసేరి నుంచి కాలికట్​కు మూడు వాహనాలు.. విమానాశ్రయానికి వెళ్లడం వెనుక ఉన్న కారణంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే వారికి బంగారు స్మగ్లింగ్​ మాఫియాతో ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: మూఢనమ్మకాలతో కన్నబిడ్డనే కొట్టి చంపిన తల్లి!

Last Updated : Jun 21, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.