ETV Bharat / bharat

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి - ఫతేపుర్ చౌరాసి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

accident in up, five killed
road accident in up
author img

By

Published : May 28, 2021, 4:57 AM IST

Updated : May 28, 2021, 6:50 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఫతేపుర్ చౌరాసి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా దూసుకువచ్చిన ఎస్​యూవీ కారు నియంత్రణ కోల్పోయి.. రెండు బైక్​లతో పాటు సైకిల్​ను ఢీ కొట్టిందిని పోలీసులు తెలిపారు. ఆపై ఎస్​యూవీ దారి పక్కన ఉన్న గుంతలో పడిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు రాకేశ్​, అతని తండ్రి రాజారామ్​, కుమారుడు రితిక్​గా గుర్తించారు. మరో ఇద్దరు ఆషిశ్​, సౌరభ్​ అని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే ఎస్​యూవీ డ్రైవర్ పారిపోయినట్లు అధికారులు వివరించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ​

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చనిపోయిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడని వారికి రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మెరుగైన వైద్యసేవలు అందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య

Last Updated : May 28, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.