ETV Bharat / bharat

రాయిని రూ. 6కోట్లకు అమ్మేందుకు విఫలయత్నం-అరెస్ట్​

కర్ణాటకలో నకిలీ వజ్రపు ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఓ రాయికి ఏకంగా రూ.6 కోట్లు విలువ కట్టి.. దాన్ని డైమండ్​ అని నమ్మబలికి విక్రయించేందుకు యత్నించారు దుండగులు. ఇంతలో అసలు విషయం బయటపడగా.. నిందితులు కటకటాల పాలయ్యారు.

Fake diamond stone
నకిలీ వజ్రపు రాయి
author img

By

Published : May 6, 2021, 10:55 AM IST

Updated : May 6, 2021, 2:42 PM IST

కర్ణాటకలో నకిలీ వజ్రాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిక్కబల్లపురాలోని ఓ ముఠా సభ్యులు.. రంగురాయిని చూపిస్తూ తమకు వజ్రం లభించిందని నమ్మబలికారు. దాన్ని విక్రయించేందుకు సన్నద్ధమై.. రూ.6 కోట్లు విలువకట్టి అమ్మకానికి పెట్టారు.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో శునకం అరెస్ట్​.. కారణమదే?

పెట్రోల్​ బంక్ నిర్మాణం కోసం భూమిని వెతికే పనిలో ఉన్న ప్రశాంత్​.. వారి కంటపడ్డాడు. తాము రియల్​ ఎస్టేట్​ వ్యాపారులమంటూ అతడికి పరిచయమయ్యారు ఆ నిందితులు. తమ వద్ద రూ.6 కోట్ల వజ్రపు రాయి ఉందని, అది తమ పొలంలో దొరికిందని చెప్పారు. అంత సొమ్ము తాను చెల్లించలేనని ప్రశాంత్​ అన్నారు. అయితే.. దాన్ని అమ్మేందుకు సహకరిస్తే చాలు.. రూ.3 కోట్లు కమీషన్​గా ఇస్తామని ఆశచూపారు. ఈ ఒప్పందానికి సరేనన్నాడు ప్రశాంత్​.

ఆ తర్వాత.. అది నకిలీదని తేలడం వల్ల.. నివ్వెరపోవడం ప్రశాంత్​ వంతైంది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మంజునాథ్​ సహా.. అతడికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: కరోనా రోగులకు ఆటో సేవలు- ఉపాధ్యాయుడి ఉదారత

Last Updated : May 6, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.