ETV Bharat / bharat

నల్ల పసుపు, గోధుమ- ఒడిశా వాసి అరుదైన పంట - నల్ల రకం గోధుమ, పసుపు సాగు

ఒడిశా రాష్ట్రానికి చెందిన దివ్యరాజ్​ బెరిహా అరుదైన పంటలను సాగు చేస్తున్నారు. అంతరించిపోతున్న స్థితిలో ఉన్న నల్ల రకం గోధుమ, పసుపును పండించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా బొటానికల్ శాస్త్రవేత్త అయిన దివ్యరాజ్​.. ఇటువంటి అరుదైన రకాలను కాపాడటమే తన లక్ష్యమని చెబుతున్నారు.

odisha, crops
ఒడిశా వాసి అరుదైన పంటల సాగు
author img

By

Published : Mar 4, 2021, 8:32 AM IST

ఒడిశా వాసి అరుదైన పంటల సాగు

పసుపు, గోధుమ పంటల గురించి మనకందరికీ తెలిసిందే. అయితే వాటిలోనే నల్ల పసుపు, నల్ల గోధుమలు ఉంటాయని తెలిసిన వారు చాలా అరుదు. ఆ పంటలు అంతరించిపోయే దశలో ఉండటమే అందుకు కారణం. ఇలా అంతరించిపోతున్న పంటలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఒడిశాలోని సంబల్​పుర్​కు చెందిన దివ్యరాజ్​ బెరిహా నడుం బిగించారు. వీటితో పాటు కొత్త రకం విత్తనాల సృష్టికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వృత్తి రీత్యా బొటానికల్​ శాస్త్రవేత్త అయిన దివ్యరాజ్​.. అరుదైన రకానికి చెందిన నల్ల పసుపు, నల్ల గోధుమలను తన ఫాంహౌస్​లో విజయవంతంగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు కణజాల వర్ధనంపై పరిశోధన జరుపుతున్నారు. వృక్షశాస్త్రంలో ఎంఫిల్​ చేసిన దివ్యరాజ్​.. బయెఫ్లక్స్​ పిసికల్చర్​, నల్ల రకం వరిపైనా ఇదివరకు పరిశోధన చేశారు. తాజాగా ఈ నల్ల పసుపు, నల్ల గోధుమ సాగుతో స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒడిశాలో ఈ తరహా పంటలను సాగు చేయడం ఇదే తొలిసారి.

నల్ల రకంతో లాభాలివే!

నల్ల గోధుమలో ఔషధ గుణాలు సాధారణ వాటి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇందులో లభించే ఎంతోసియాసిన్​.. క్యాన్సర్​, కీళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలను నయం చేస్తుంది. ఈ గోధుమకు ప్రస్తుతం డిమాండ్​ పెరుగుతోంది. మార్కెట్లో కేజీ నల్ల గోధుమ పిండి ధర రూ.600 పలుకుతోంది. నల్ల గోధుమ విత్తనాల ధర కేజీ రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉంటోంది.

గోధుమలతో పాటు దివ్యరాజ్​ సాగు చేస్తున్న నల్ల పసుపు పంటలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ వ్యాధులకు, అజీర్తి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర కేజీ రూ.4500గా ఉంది.

సాగు కోసం దివ్యరాజ్​.. నల్లగోధుమల విత్తనాలను పంజాబ్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సేకరించారు. అలాగే దేబ్​గఢ్​ అటవీ ప్రాంతం నుంచి నల్ల పసుపును సేకరించి సాగు చేశారు. దేబ్​గఢ్ అటవీ ప్రాంతంలో ఈ పసుపు జాతి దాదాపుగా అంతరించిపోయింది.

ప్రశంసలు

వైవిధ్యమైన పంటలను సాగు చేసేందుకు దివ్యరాజ్ చేస్తున్న కృషికి అన్ని వైపుల నుంచి ప్రసంశలు కురుస్తున్నాయి. అంతరించిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం కూడా అతనికి సహాయం అందించింది. భవిష్యత్తులో కూడా తన పరిశోధనను కొనసాగిస్తానని దివ్యరాజ్​ పేర్కొన్నారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే.. ఈ పంటల సాగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్​: భాజపాలో గంగూలీ చేరిక ఖాయమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.